iDreamPost

Godfather గాడ్ ఫాదర్ మిస్సవుతున్న సూత్రం

Godfather గాడ్ ఫాదర్ మిస్సవుతున్న సూత్రం

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటేనే కనీసం నెల రోజుల నుంచి ఓ రేంజ్ లో హడావిడి ఉంటుంది. అలాంటిది గాడ్ ఫాదర్ ఇంకో 20 రోజుల్లో రావడం కన్ఫర్మ్ అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎలాంటి సౌండ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న వదిలిన చిరు సల్మాన్ ల కాంబో సాంగ్ బిట్ కూడా ట్రోలింగ్ కు గురయ్యిందే తప్ప ఏమంత ఎగ్జైట్ మెంట్ కలిగించలేదు. అంత పెద్ద క్యాస్టింగ్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు, కొణిదెల సూపర్ గుడ్ ఫిలిమ్స్ జాయింట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉన్నా కూడా అదేదో సామెత చెప్పినట్టు ప్రమోషన్లు నత్త నడకన సాగుతూ సినిమా మీద ఆసక్తిని పెంచలేకపోతున్నాయి.

ఇదంతా ఆచార్య ఎఫెక్ట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంత కంటే పెద్ద డిజాస్టర్లు గతంలో బోలెడొచ్చాయి. కేవలం ఒక ఫ్లాప్ తో ఏ హీరో కెరీర్ ప్రభావితం కాదు. అందులోనూ శిఖరం లాంటి ఇమేజ్ ఉన్న నూటా యాభై సినిమాల చిరంజీవికి. ఇక్కడ పొరపాటు సరైన ప్లానింగ్ లేకపోవడమే. ఎంత మెగా మూవీ అయినా సరే దేన్నీ తేలిగ్గా తీసుకోకూడదు. ఆర్ఆర్ఆర్ కు భీభత్సమైన క్రేజ్ ఉన్నా సరే రాజమౌళి దేశమంతా ఎందుకు తిరగాల్సి వచ్చింది. ఒకదశలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి ఆఖరికి తన భాషకూడా మర్చిపోయాడు. అంత చేస్తేనే కెజిఎఫ్ 2ని దాటలేక పదకొండు వందల కోట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. ఇంతకన్నా వేరే చెప్పాలా.

ఇది మార్కెటింగ్ ప్రపంచం. వస్తువు తయారు చేయడం సులభం. దాన్ని జనంలోకి తీసుకెళ్లడమే పెద్ద సవాల్. గాడ్ ఫాదర్ ఈ సూత్రాన్ని మిస్ అవుతోంది. హైప్ రావాలంటే ఏం చేయాలో ఆ అవకాశాలను వాడుకోవడం లేదు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముతిరఖని ఇంత బలమైన తారాగణం పెట్టుకుని అన్నిటిని మించి సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియోని ఉంచుకుని ఈపాటికే ఎక్కడ చూసినా గాడ్ ఫాదర్ డిస్కషన్స్ జరగాలి. కానీ అలాంటిదేమి లేదు. అసలు ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ప్రైమ్ లో ఉన్నప్పుడే తేలిగ్గా తీసుకోవడం దగ్గరే మొదలయ్యింది ఈ నిర్లిప్తత. ఇకనైనా కిక్ ఇచ్చేలా ఏదైనా గ్రాండ్ గా మొదలుపెడితే అక్టోబర్ 5కి భారీ ఓపెనింగ్స్ ఆశించవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి