iDreamPost

కిక్ 2 రూమర్లని కొట్టిపారేసిన ప్రొడక్షన్ హౌజ్

  • Published Mar 11, 2024 | 10:57 AMUpdated Mar 11, 2024 | 10:57 AM

salman khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ టాలీవుడ్ హిట్ సినిమాకు సీక్వెల్ గా నటించనున్నారనే వార్త ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

salman khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ టాలీవుడ్ హిట్ సినిమాకు సీక్వెల్ గా నటించనున్నారనే వార్త ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

  • Published Mar 11, 2024 | 10:57 AMUpdated Mar 11, 2024 | 10:57 AM
కిక్ 2 రూమర్లని కొట్టిపారేసిన ప్రొడక్షన్ హౌజ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగమైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అంతకుముందు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో తదుపరి సినిమాతో సరైన కమ్ బ్యాక్ ఇవ్వాలని ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా షేర్షా వంటి పేట్రియాటిక్ బ్లాక్ బస్టర్ అందించిన సౌత్ డెరైక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో బుల్ అనే సినిమాని చేయాల్సి ఉంది, కానీ సల్మాన్ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా గతంలో సల్మాన్ ఖాన్ నటించిన కిక్ ( తెలుగు రవితేజ కిక్ రీమేక్) సినిమాకి సీక్వెల్ రానుందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కిక్ సినిమా ప్రొడక్షన్ హౌజ్ కొట్టిపారేసింది.

ప్రస్తుతం సల్మాన్ ఏఆర్‌ మురుగదాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సాజిద్ నడియాద్వాలా నిర్మాత. గతంలో అమీర్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన గజిని హిందీ వెర్షన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయింది. బాలీవుడ్ మీడియాలో కథనాల ప్రకారం, కిక్ 2 సినిమా కోసమే సల్మాన్‌తో ఏఆర్ మురుగదాస్ పని చేస్తారని గత కొద్దిరోజులుగా కొన్ని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అవేవీ నిజం కాదని సాజిద్ నడియాద్వాలా టీమ్ ద్వారా తేలిపోయింది.

The production house rubbished the Kick 2 rumours 1

పైన చెప్పుకున్న విధంగా తెలుగుకో బ్లాక్ బస్టర్ అయిన కిక్ హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అందువల్ల, కిక్ 2 గురించిన తాజా వార్తలు సల్మాన్ ఖాన్ అభిమానులను ఎగ్జైట్ చేశాయి. అయితే, నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. “కిక్ 2 గురించి అన్ని ఊహాగానాలు, పుకార్లు అవాస్తవమని మేము అధికారికంగా ప్రకటిస్తున్నాము” అని ట్వీట్ లో చెప్పేయడంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఏఆర్‌ మురుగదాస్‌ తో ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌ తమ బ్యానర్ లో వీలైనంత త్వరగా ఈ వార్తకు సంబంధించిన ఇస్తామని తెలియజేశారు.

కిక్ 2: నో సీక్వెల్ ఫర్ సల్మాన్ ఖాన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి