iDreamPost

గాడ్ ఫాదర్ టార్గెట్ 200 కోట్లా?

గాడ్ ఫాదర్ టార్గెట్ 200 కోట్లా?

అదేంటి పెద్దగా బజ్ లేదు పైగా ప్రమోషన్లు సరిగా చేయడం లేదని ఫ్యాన్స్ కోపంగా ఉన్న సినిమాకు ఏకంగా రెండు వందల కోట్లు టార్గెట్ ఏమిటనుకుంటున్నారా. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది నిజమేనట. అన్ని హక్కులు కలిపి ఈ మొత్తం వచ్చేలా నిర్మాతలు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇందాక రాజకీయాలు నాకు దూరం కాలేదని అర్థం వచ్చేలా చిరు ట్వీట్ చేసిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది గాడ్ ఫాదర్ లో డైలాగే అయినప్పటికీ కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా దీనిపై డిబేట్లు మొదలుపెట్టాయి. తన మార్కు స్టైల్ లో మెగాస్టార్ ఇలా పబ్లిసిటీకి శ్రీకారం చుట్టారన్న మాట. సినిమాలోని ఈ కీలక సన్నివేశంలో ఈ సంభాషణ ఉంటుంది.

బిజినెస్ వివరాల్లోకి వెళ్తే ప్రొడ్యూసర్లు థియేట్రికల్ రైట్స్ నుంచి 90 కోట్ల దాకా ఆశిస్తున్నారు. అయితే ఆచార్య ఫలితం దృష్ట్యా కొన్ని ఏరియాలకు బయ్యర్లు అంత మొత్తం పెట్టేందుకు వెనుకాడటంతో నిర్మాతలు అక్కడ స్వంతంగా రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ 57 కోట్లకు సొంతం చేసుకుందట. సల్మాన్ ఖాన్ క్యామియో చేయడం వల్ల అనుకున్న దాని కన్నా రేట్ ఎక్కువ పలికిందని సమాచారం. శాటిలైట్ హక్కులు ఆడియో రెండూ అన్ని బాషలకు కలిపి 60 కోట్లకు అమ్మేశారు. సో మొత్తంగా 207 కోట్లు. బ్లాక్ బస్టర్ అయితే పైసా నష్టం రాకుండా ఈజీగా రికవర్ అవుతుంది. ఏదైనా అటుఇటు అయితే ప్రొడక్షన్ హౌసే భరిస్తుంది

రాబోయే రెండు వారాల్లో ప్రమోషన్ స్పీడ్ పెంచేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. 28న అనంతపూర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. దానికన్నా ముందు 25న ట్రైలర్ లాంచ్ జరగొచ్చు. ఇవాళ రాత్రి లోగా తక్కర్ మార్ లిరికల్ వీడియో యుట్యూబ్ లో ప్రత్యక్షమయ్యే ఛాన్స్ ఉంది. మరో రెండు పాటలు క్యూలో ఉన్నాయి. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు టీమ్ రెడీ అవుతోంది. చిరు సత్యదేవ్ మోహన్ రాజా సునీల్ తదితరులను దీనికి సిద్ధం చేస్తున్నారు. అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ వస్తున్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ ఈ మాత్రం దూకుడు చూపించకపోతే ఓపెనింగ్ టైంలో ఇబ్బందవుతుంది. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి