iDreamPost

చింతా… ఏంటి వింత మాటలు..?

చింతా… ఏంటి వింత మాటలు..?

ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా సాగేవి. కాలంతో పాటు నాయకులు మారుతూ రాజకీయాలను బ్రష్టు పట్టించారు. ఇటీవల కాలంలో నాయకులు తాము ఏం మాట్లాడుతున్నామో అని తెలియకుండానే మాట్లాడేసి నవ్వుల పాలవుతున్నారు.

చింతా మోహన్. రాజకీయాలపై ఏ కొంచెం అవగాహన ఉన్న వారికైనా ఈ పేరు సుపరిచితమే. కాంగ్రెస్ నేతగా ఒక వెలుగు వెలిగారు. 5 సార్లు ఎంపీగా గెలిచి, పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇంత అనుభవం ఉన్న నేత ఎంత హుందాగా మాట్లాడాలి.? ఆరోపణలు చేస్తే అవతలి వాళ్లు కనీసం కౌంటర్ కూడా చేయలేని విధంగా మాట్లాడాలి.

కానీ, తన రూటే సెపరేట్ అని చింతా నిరూపించుకున్నారు. అర్థం లేని ఆరోపణలు చేస్తూ అభాసుపాలవుతున్నారు. ఆయన ఇటీవల చేసిన వాఖ్యలు ఆయన అవివేకాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.

తిరుపతి ఉప ఎన్నిక ఈ నెల 17తో ముగిసింది. మరో నాలుగు రోజుల్లో ఫలితం కూడా రానుంది. ఈ నేపథ్యంలో చింతా చేస్తున్న వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ లకు తాను ఏ మాత్రం తీసిపోనంటు నిరూపించుకుంటున్నారు. తనను ఓడించేందుకు వైసీపీ బీజేపీలు ఏకమయ్యాయట. ఈ రెండుపార్టీలు ఎందుకు కలిశాయంటే కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవటానికేనట. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని రెండు పార్టీలకు అర్ధమైపోయిందట. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడే కాదు.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల చ‌రిత్ర కూడా వెలుగులోకి తెచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు, 22 ఎంపీ స్థానాలు ఎలక్టోరల్‌ మోసంతోనే వచ్చాయట‌.

ఇలా ఉంది చింతా వారి అవివేకం. 5 సార్లు ఎంపీగా చేసిన ఆయనకు ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియదు అనుకోవాలా..? అంతేకాదు దొంగ ఓట్లు కూడా భారీగా వేసుకున్నారంట వైసీపీ నేతలు. అసలు ఓటు ఎలా వేస్తారో తెలిసిన వాళ్లు ఎవరు .. ఇంత అవివేకంగా మాట్లాడరు. ఒక్క దొంగ ఓటు పోలైతే హత్యలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. సో… ఏతావాత చెప్పొచ్చేది ఏంది అంటే .. సినిమాల్లో కామెడీ తక్కువై పోవడంతో ఆ లోటుని రాజకీయ నాయకులు తీరుస్తున్నారు.

Also Read : కొత్త కేడ‌ర్ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి