iDreamPost
android-app
ios-app

పోటీపడి గాడిదలను చంపేస్తున్న చైనీయులు! కారణం తెలుసా?

  • Published Feb 19, 2024 | 8:54 PMUpdated Feb 19, 2024 | 8:54 PM

ఈ మధ్యకాలంలో మార్కెట్ లో ఎప్పుడు ఏదీ ట్రెండ్ గా మారుతుందో ఎవరు ఊహించలేరు. దీంతో తాజాగా గాడిదలకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగిపోయింది. అందుకోసం ఈ గాడిదలతో వ్యాపారం చేయడానికి ఓ దేశంలో చేస్తున్నా పని తెలుస్తే ఆశ్చర్యపోతారు.

ఈ మధ్యకాలంలో మార్కెట్ లో ఎప్పుడు ఏదీ ట్రెండ్ గా మారుతుందో ఎవరు ఊహించలేరు. దీంతో తాజాగా గాడిదలకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగిపోయింది. అందుకోసం ఈ గాడిదలతో వ్యాపారం చేయడానికి ఓ దేశంలో చేస్తున్నా పని తెలుస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Feb 19, 2024 | 8:54 PMUpdated Feb 19, 2024 | 8:54 PM
పోటీపడి గాడిదలను చంపేస్తున్న చైనీయులు! కారణం తెలుసా?

ప్రస్తుత కాలంలోని మార్కెట్ లో ఎప్పుడు ఏదీ ట్రెండ్ గా మారుతుందో ఎవరు ఊహించలేరు. దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త వ్యాపారాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రజల అవసరాలకు వారి ఇష్టాలకు అనుగుణంగా.. వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటూ వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇలా వ్యాపారాలను ప్రారంభిస్తూ డబ్బులు ఆర్జిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఇప్పుడు ఇదే కోవలో గాడిద కూడా ఉంది. అవును ప్రస్తుతం మార్కెట్ లో గాడిదకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇదివరకే గాడిద పాలు అమ్ముతూ ప్రజలు పెద్ద ఎత్తున లాభాలను సంపాదిస్తున్నా విషయం తెలిసిందే. కాగా, ఈ గాడిద వ్యాపారాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం తమ ఉద్యోగాలను చేస్తున్నారు. ఇప్పుడు గాడిదలకు అధిక డిమాండ్ ఉండటంతో వాటిని దొంగిలించి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసే పరిస్థితి ఏర్పాడింది. అయితే, తాజాగా ఈ గాడిదలను సాంప్రదాయ వైద్యంలో ఉపాయోగించడం కోసం ఓ దేశంలో చేస్తున్నా పని తెలుస్తే ఆశ్చర్యపోతారు.

ప్రపంచంలో గాడిదల జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఆఫ్రికా అని అందరికి తెలిసిందే. అయినప్పటికీ వీటి డిమాండ్ పెరగడం కారణంగా గాడిదలను దొంగిలించి మరి అక్రమంగా చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఈ గాడిద చర్మం నుంచి లభించే జెలటిన్ అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చైనాలోని ప్రజలు అభిప్రాయ పడతారు. అందుకోసం జెలటిన్ సాంప్రదాయ వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. అలాగే ఈ జెలటిన్ చర్మాన్ని ఉడకబెట్టడం ద్వారా మాత్రమే పొందవచ్చు. అందుకోసం ఈ గాడిదలను భారీ సంఖ్యలో చంపాల్సి వస్తోందని తాజా గణాంకల్లో తెలిసింది.

అయితే ఇలా గాడిదలను చంపే పద్థతి ఒక్క చైనాలోనే కాకుండా.. ఇతర దేశాల్లోనూ కూడా చేస్తున్నారు. ఇలా సాంప్రదాయ మందుల్లో జెలటిన్ వాడకం కోసం ప్రతి ఏటా సగటున 59 లక్షల గాడిదలు చంపబడుతున్నాయి. అలాగే ఈ గాడిదల పెంపకం అనేది ఆఫ్రికాలో చాలా ఎక్కువ మంది చేసే ప్రధాన వృత్తి. ఇందులో భాగంగానే చైనా వంటి ఇతర దేశాలకు గాడిదలను ఎగుమతి చేస్తుంటారు. అందుకోసమే ఈ గాడిదలను దొంగిలించి అక్రమంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారని చెబుతున్నారు.ఇక గాడిదలకు ఉన్న డిమాండ్ వలన కొన్ని దేశాల్లో రైతులకు మంచి లాభాదాయకంగా మారింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పాలు తాగడం వల్ల అనారోగ్య సమస్యలను దూరమవుతాయని చాలామంది చెబుతారు. మరి, చైనాలో వ్యాపారం కోసం గాడిదలను చంపేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి