iDreamPost

ఈ పాపను గుర్తుపట్టారా? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి వెళ్ళిపోయింది!

  • Author ajaykrishna Published - 05:51 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 05:51 PM, Thu - 6 July 23
ఈ పాపను గుర్తుపట్టారా? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి వెళ్ళిపోయింది!

ఇండస్ట్రీలో రెగ్యులర్ వార్తలు ఎప్పుడూ వినిపించేవే. హీరో హీరోయిన్స్ గురించి మొదలుకొని అప్ కమింగ్ యాక్టర్స్ వరకు అందరిపై రోజూ ఏదొక వార్త లేదా రూమర్స్ వింటుంటాం. కానీ.. వాళ్ల గురించి కొన్ని విషయాలు మాత్రం మనకు చాలా ఇంటరెస్ట్ కలిగిస్తుంటాయి. ఎలాగంటే.. హీరో హీరోయిన్స్ కి సంబంధించి లవ్, డేటింగ్ విషయాలు. ఇవన్నీ కాదు అనుకుంటే వాళ్ల గురించి మనం ఎప్పుడు వినని సంఘటనలు లేదా చిన్ననాటి జ్ఞాపకాలు. కొన్నిసార్లు ఇవి కూడా ఆసక్తి రేపుతుంటాయి. ఫలానా హీరో హీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉండేవారు.. ఏం చేసేవారు.. ఎలాంటి వాతావరణంలో పెరిగారు? అనే విషయాలు వాళ్ళు చెబితే ఇంకా ఇంటరెస్ట్ కలుగుతుంది.

ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప.. ఒక స్టార్ హీరోయిన్. దేశవ్యాప్తంగా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కూడా పెద్ద హీరోతో మూవీ చేసింది. కానీ.. ట్విస్ట్ ఏంటంటే.. తను ఇప్పటిదాకా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. ఒకే సినిమా చేసిందంటే నమ్మబుద్ది కావట్లే కదా! కానీ.. ఈపాటికి ఆమె ఎవరో మీకు గుర్తుకు వచ్చి ఉండాలి. వచ్చిందా.. ఇంకా చెప్పాలంటే ఆమె బెస్ట్ యాక్ట్రెస్ గా మూడుసార్లు నేషనల్ అవార్డులు అందుకుంది. ఎస్.. ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. ఓకే.. ఇంత చెప్పినా కొందరికి తెలియకపోవచ్చు. వాళ్ల కోసం మరో క్లూ.. ఈ పాపను ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు.

ఆమె ఎవరో తెలిసిందా.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. సంప్రదాయం నుండి బికినీ వరకు సినిమా కోసం ఎలాంటి సన్నివేశాలలో అయినా జీవించేస్తుంది. అలాగని సినిమాలలో బయట ఒకేలా ఉండదు. కానీ.. ఒక్కసారి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాల్సిందే. పైగా బయోపిక్ లకు పెట్టింది పేరు అన్నట్లుగా మారింది అమ్మడు. కంగనా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా.. ఏక్ నిరంజన్. డార్లింగ్ ప్రభాస్ హీరోగా చేసిన ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కంగనా మాత్రం మళ్లీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. కానీ.. బాలీవుడ్ లో మాత్రం సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకొని నేషనల్ అవార్డులు అందుకుంది. మరి అలాంటి ఫైర్ బ్రాండ్ చిన్నప్పుడు ఎలా ఉందో చూశారా? ప్రెజెంట్ కంగనాకు సంబంధించి ఈ చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి