iDreamPost

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నిరుద్యోగులకి వద్దన్నా జాబ్స్ పక్కా!

  • Published Apr 12, 2024 | 6:02 PMUpdated Apr 12, 2024 | 6:02 PM

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనులు చేపడుతుంది. ఈ క్రమంలో తాజాగా .. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి అవకాశం అంటూ మరొక గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనులు చేపడుతుంది. ఈ క్రమంలో తాజాగా .. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి అవకాశం అంటూ మరొక గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది.

  • Published Apr 12, 2024 | 6:02 PMUpdated Apr 12, 2024 | 6:02 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నిరుద్యోగులకి వద్దన్నా జాబ్స్ పక్కా!

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మొదలయ్యి.. ఇంకా ఐదు నెలలు కూడా కాకముందే.. వేగవంతంగా ఎన్నికలకు ముందు చేసిన ప్రమాణాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా ఈ కొత్త పథకాలపైన పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటూ.. రాష్ట్ర అభివృద్ధికై కృషి చేయనుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించే దిశగా కూడా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ఎన్నో వార్తలను ఇప్పటివరకు వింటూనే ఉన్నాము. ఇక ఇప్పుడు తాజాగా .. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి అవకాశం అంటూ.. మరొక గుడ్ న్యూస్ తో ప్రజల ముందుకు వచ్చేసింది. ఈ దిశగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయో పరిమితి.. 33 ఏళ్ళు లేదా 61 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వీస్ లు పూర్తయిన అధికారులకు వెంటనే పదవీ విరమణ ఏర్పాట్లు చేయాలంటూ.. రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు భారీ స్థాయిలో.. మేలు చేకూర్చే అవకాశాలు కల్పించాలని.. నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 31 నుంచే రాష్ట్రంలో పదవీ విరమణలు మొదలయ్యాయి. దీనితో ప్రభుత్వం కొత్త నిర్ణయాలపై దృష్టి పెడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించే దిశగా ఏర్పాట్లు సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం కోసం.. ఆ ఫైల్ ను పై అధికారులకు పంపారు. అయితే దీనిని ఆమోదించేందుకు ఇప్పడు ఎన్నికల కోడ్ అడ్డుగా మారింది. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే దీనిని అమలులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jobs in Telangana

అయితే, గత ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ పార్టీ.. పదవి విరమణ వయో పరిమితిని 58 ఏళ్ళ నుంచి.. 61 ఏళ్లకు పెంచింది. ఇక ఇప్పుడు ఆ వయో పరిమితి గడువులు ముగుస్తుండడంతో.. రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో పదవి విరమణలు కొనసాగుతున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. కాబట్టి అప్పటివరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుంది. ఇక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే.. రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి అవకాశాల విషయాలు బయటకు రానున్నాయి. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా.. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీనితో ఇప్పటికే చేపడుతున్న సేవ కార్యక్రమాలకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ఇంకొన్ని నెలలు వేచి ఉండాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి