iDreamPost

తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు

తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ 2019లో భాస్కర్ రెడ్డి నియామకం మీద ఉత్తర్వులు విడుదల చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.మొత్తం మూడేళ్ళ పదవీకాలంతో ఆయనకు తుడా చైర్మన్ పదవి దక్కింది.

అయితే ఇప్పుడు తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకుముందే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పదవీకాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి చెవిరెడ్డి జగన్ వెంటనే నడిచారు. జగన్ కు నమ్మినబంటు అని చెవిరెడ్డికి పేరుంది.

చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2014, 2019లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. SV యూనివర్సిటీలో NSUI విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో 27 సంవత్సరాల వయస్సులో జెడ్పీటీసీ సభ్యుడు అయ్యారు, 5 సంవత్సరాలు జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్ హయాంలో 2007లో తుడా చైర్మన్ అయిన ఆయన 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి