iDreamPost

పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి MP, MLA!

MP, MLA join Congress party: పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. BRS పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు.

MP, MLA join Congress party: పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. BRS పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి MP, MLA!

పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు హస్తం గూటికి చేరుకోగా.. ఆ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు నగరా మోగడంతో.. కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని విధంగా నాయకులు వచ్చి చేరుతున్నారు. తాజాగా BRS పార్టీ నాయకుడు, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైయ్యాయి. ఈ క్రమంలోనే చేరికలు కూడా ప్రారంభమైయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ.. హస్తం గూటికి చేరుకున్నారు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆదివారం జరిగిన మీట్ ది మీడియా కార్యక్రమంలో వీరిద్దరు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..” కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక గేట్ తెరిచాము. అయితే అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా, మూసినా ఒకటే” అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. కాగా.. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇది నిజంగా పెద్ద షాకనే చెప్పాలి.

ఇదికూడా చదవండి: Telangana: రైతు భరోసాపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! ఇక నుంచి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి