iDreamPost

అయోధ్య రామందిరానికి విరాళ‌మిచ్చిన‌ 22 కోట్ల విలువైన చెక్కులు చెల్ల‌లేదు

అయోధ్య రామందిరానికి విరాళ‌మిచ్చిన‌ 22 కోట్ల విలువైన చెక్కులు చెల్ల‌లేదు

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలివ్వ‌డం ఒక ఆధ్యాత్మిక‌ ఉద్య‌మంలా సాగింది. తోచినంత మేర రామ‌మందిర ట్ర‌స్ట్ కు చాలామంది డొనేష‌న్స్ పంపించారు. ఒక ద‌శ‌లో వెండి ఇటుక‌ల‌ను దాచే ప్లేస్ లేదు, ఇక చాలున‌ని ట్ర‌స్ట్ అభ్య‌ర్ధించింది.

ఇక నిర్మాణానికి వ‌చ్చిన చెక్కులను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, కొన్ని వేల‌ చెక్కులు చెల్లలేదు. దానికి చాలా రీజ‌న్స్ ఉన్నాయ‌ని అంటోంది అయోధ్య‌లోని శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్ధ‌క్షేత్ర ట్ర‌స్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) రూ.ల‌క్ష నుంచి 5 ల‌క్ష‌ల‌కు వ‌ర‌కు చెక్కుల్లో విరాళాలు ఇచ్చిన‌వారు 31,663. ఇక 5 ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు విరాళాలు ఇచ్చిన‌వారు 1,428 మంది. దేశంలో చాలామంది భ‌క్తులు రామాల‌య నిర్మాణానికి విరాళాలు పంపించారు. కాని అందులో 22 కోట్ల రుపాయిల విలువైన‌ 15,000 చెక్కులు బౌన్స్ అయ్యాయి.

జిల్లావారీగా అందిన విరాళాలను ప్ర‌క‌టించిన విశ్వ‌హిందూ ప‌రిష‌త్, రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్ కు 3,400కోట్ల రుపాయిల మేర విరాళాలు వ‌చ్చాయ‌ని ప్ర‌క‌టించింది. బౌన్స్ అయిన చెక్ ల వివ‌రాలిచ్చిన ట్ర‌స్ట్, ఎందుకు అవి చెల్ల‌లేదో మాత్రం చెప్ప‌లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్, సంత‌కం మ్యాచ్ కాక‌పోవ‌డం వంటి టెక్నిక‌ల్ రీజ‌న్స్ తోనే బౌన్స్ అయి ఉండొచ్చ‌ని అంటోంది. ఇలా బౌన్స్ అయిన చెక్కుల్లో ఎక్కువ వాటా అయోధ్య జిల్లా వాసుల‌వే. మొత్తం మీద 2000 చెక్కులు చెల్ల‌లేదు.

ఇక రూ.25ల‌క్ష‌ల నుంచి రూ.50ల‌క్ష‌ల వ‌ర‌కు విరాళిచ్చిన వారు 123 మంది. ఇక రూ.50ల‌క్ష‌ల నుంచి కోటి వ‌ర‌కు విరాళాలిచ్చిన వారు 127 మంది అయితే, కోటిదాటి డొనేష‌న్స్ ఇచ్చిన‌వారు 74 మంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి