iDreamPost

వీడియో: రాంలీల నాటక ప్రదర్శనలో.. స్టేజీపైనే కుప్పకూలిన హనుమాన్

బాలరాముని ప్రాణ ప్రతిష్టతో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో రాంలీల నాటక ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి పాత్రదారి గుండెపోటుకు గురై కన్నుమూశారు.

బాలరాముని ప్రాణ ప్రతిష్టతో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో రాంలీల నాటక ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి పాత్రదారి గుండెపోటుకు గురై కన్నుమూశారు.

వీడియో: రాంలీల నాటక ప్రదర్శనలో.. స్టేజీపైనే కుప్పకూలిన హనుమాన్

అయోధ్యా నగరంలో రామ్ మందిర్ ప్రారంభోత్సవంతో శతాబ్ధాల కల నెరవేరింది. నిన్న(సోమవారం) దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముని ప్రాణ ప్రతిష్టతో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, ప్రముఖులు ఈ వేడుకకు వేల సంఖ్యలో హాజరయ్యారు. దేశంలోని ప్రతి ఊరు, వాడా రామనామంతో దద్దరిల్లింది. దేశమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కొన్ని చోట్ల రామయాణ కథలు, భజనలు, కీర్తనలతో రామ భక్తులు హోరెత్తించారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో రాంలీల నాటక ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి పాత్రదారి గుండెపోటుకు గురై కన్నుమూశారు.

హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. రామాయణ గాథను స్టేజ్ పై ప్రదర్శిస్తున్న వేళ ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేళ ఆ ప్రత్యేకమైన క్షణాలను చూసేందుకు భక్తులు టీవీలు ఏర్పాటు చేసుకుని వీక్షించారు. మరి కొంత మంది రామాయణాన్ని తెలిపే నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఈక్రమంలో హర్యాణాలో రాంలీల నాటకంలో హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్టేజీపైనే గుండెపోటుకు గురై కిందపడిపోయారు. ఆ సమయంలో స్టేజీపై ఉన్నవారు.. చూసే ప్రేక్షకులు అంతా ఆయన నటిస్తున్నారేమో అనుకుని చప్పట్లు కొట్టసాగారు.

ఇక అతడు ఎంతకీ లేవకపోయే సరికి రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాద వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా మృతుడి పేరును హరీష్‌ మెహతా వెల్లడించారు. ఆయన 20ఏళ్లుగా హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారని తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి