iDreamPost

YCP మాస్ లీడర్ పై బాబు ఫోకస్! వెలుగులోకి రూ. 200కోట్లు ఖర్చు! పెద్ద ప్లానే ఇది!

Chandrababu, YSRCP: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుపును ఆపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో తనకు కొరకరాని కొయ్యగా మారిని ఓ వైసీపీ మాస్ లీడర్ ను కూడా ఓడించేందుకు బాబు మాస్టర్ ప్లాన్ వేశారని టాక్.

Chandrababu, YSRCP: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుపును ఆపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో తనకు కొరకరాని కొయ్యగా మారిని ఓ వైసీపీ మాస్ లీడర్ ను కూడా ఓడించేందుకు బాబు మాస్టర్ ప్లాన్ వేశారని టాక్.

YCP మాస్ లీడర్ పై బాబు ఫోకస్! వెలుగులోకి రూ. 200కోట్లు ఖర్చు! పెద్ద ప్లానే ఇది!

ఆంధ్రప్రదేశ్  లో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే.. ఆ ఆ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే టార్గెట్ గా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. ఇక ఇదే సమయంలో టీడీపీ, జనసేన కూటమి.. జగన్ గెలుపును ఆపడమే లక్ష్యంగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా టీడీపీ కొన్ని టార్గెట్లు పెట్టుకుందని పొలిటికల్ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది. సీఎం జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చేయడం తమ లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, అదే స్థాయిలో ఓ వైసీపీ మాస్ లీడర్ ను ఓడించడం కూడా టార్గెట్ గా పెట్టుకుంది. తనను ఓడించేందుకు టీడీపీ వాళ్లు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆ వైసీపీ మాస్ లీడర్ తెలిపారు. మరి.. ఆ వైసీపీ మాస్ లీడర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతను తాను ఎప్పుడూ చూడలేదని, తన రాజకీయం జీవితంలో ఇలాంటి గడ్డు కాలం ఎప్పుడూ ఎదుర్కొలేదని సాక్షాత్తు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తమ కూటమి గెలుపు సంగతి పక్కన పెడితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయాన్ని ఆపడమే లక్ష్యంగా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో వైసీపీ విజయం ఆపడంతో పాటు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు నాయుడు ఉన్నారు.

వైసీపీ మాస్ లీడర్లలో మాజీమంత్రి కొడాలి నాని ఒకరు. ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ కానీ, చంద్రబాబు కానీ ఏ చిన్న విమర్శ చేసిన మొదట స్పందించేది నానినే. అంతేకాక సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడతారు. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు నాయుడికి సీఎం జగన్ కంటే.. కొడాలి నానే కొరకరాని కొయ్యగా మారారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడ అవకాశం దొరికిన చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారు కొడాలి నాని.

ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబును కొడాలినేని ఆడుకున్నంతగా మరే వైసీపీ నేతలు విమర్శించలేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కొడాలి నాని మరోసారి గెలిస్తే..తనకు ఇంకా తనకు ఇంకా తలనొప్పి అని.. ఎలాగైనా ఈసారి ఓడించాలనే చంద్రబాబు ఉన్నట్లు టాక్. అందుకే గుడివాడలో పలుమార్లు అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. ధన బలం ఉన్న నేత కోసం వేటాడి.. చివరకు వెనిగండ్ల రాము అనే ఎన్నారైను గుడివాడ అభ్యర్థిగా ప్రకటించాడు. ఖర్చుకు వెనుకాడడనే రామును గుడివాడ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఇటీవల కొడాలి నాని సైతం మీడియాతో మాట్లాడుతూ..నన్ను ఓడించేందుకు దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

ఇది ఇలాంటి.. గుడివాడలో నానిని ఓడించడం అంత ఈజీగా కాదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం.. నాని డబ్బులను పంచూ ఎదిగిన నాయకుడు కాదు. జనాల్లో కలిసి, వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారిలో ఒకడిగా ఉంటూ ఎదిగిన నేత. గుడివాడ నియోజవర్గంలోని ప్రతిగడపకు నాని సుపరిచితం. అక్కడి ప్రతి కుటుంబం..నాని తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తుంది. అందుకే ఆయనను పార్టీతో సంబంధం లేకుండా గుడివాడ ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. ఇలా ప్రజా బలం ఉన్న నేతను ఢీ కొట్టేందుకు డబ్బును ఎరగా వేసిన ఫలితం శూన్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయ పడుతున్నారు.

పలు సర్వేలు కూడా కొడాలి నానిదే మరోసారి విజయం అని తేల్చి చెప్పాయి. ఇప్పటికే 2004 నుంచి ఇప్పటికే వరుసగా ఓటిమి ఎరుగని నేతగా కొడాలి నాని నిలిచారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని 2024లో మరోసారి గెలవనున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా కొడాలి నాని గెలుపును ఆపేందుకు టీడీపీ ఆపసోపాలు పడుతుందనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి