iDreamPost

చంద్రబాబు మాట, బాట మార్చిన జగన్! ఇంత భయపెట్టాడా?

YS Jagan, Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, రాజకీయశైలి చాలా ప్రత్యేకమైనది. ఆయనను విమర్శించిన వారిని సైతం తన బాటలోకి రప్పిస్తారు. ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే.. తన మాట, బాట విషయంలో సీఎం జగన్ ను ఫాలో అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

YS Jagan, Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, రాజకీయశైలి చాలా ప్రత్యేకమైనది. ఆయనను విమర్శించిన వారిని సైతం తన బాటలోకి రప్పిస్తారు. ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే.. తన మాట, బాట విషయంలో సీఎం జగన్ ను ఫాలో అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు మాట, బాట మార్చిన జగన్! ఇంత భయపెట్టాడా?

సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు అనేవి సర్వసాధారణం. కానీ అవి ఒక పరిధిని మించి చేసిననప్పుడు మాత్రం అవి చేసిన వారికి రివర్స్ అవుతుంటాయి. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో తాము విమర్శించిన వారు చేపట్టిన పనులనే అనుసరిస్తుంటారు. అలా అనుకరించే వారి జాబితాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేరారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల టీడీపీ, జనసేన నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు మాట్లాడుతున్న విధానం చూస్తే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటను అనుకరిస్తున్నారు. జగన్ పరిపాలనపై అనేక విమర్శలు చేసిన బాబునే మాట, బాట జగన్ ను అనుకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలకు వివిధ స్కీమ్స్ కింద డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అలానే పేద విద్యార్థుల చదువు కోసం అనేక  పథకాలను ప్రవేశపెట్టాడు. అలానే బడుగు బలహీన వర్గాల ప్రజల, రైతుల కోసం ఎన్నో అద్భుత స్కీమ్స్ ను ప్రవేశ పెట్టారు. మహిళల అభివృద్ధి కోసం ఆసరా, వివిధ స్థాయిలో విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన వంటివి ఎన్నో స్కీమ్స్ ను ప్రవేశ పెట్టి..వారి అభివృద్థి నిలబడ్డారు. వృద్ధులకు సైతం ఏటా కాస్తా పెంచుకుంటూ ప్రస్తుతం రూ.3000 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తెల్లవారింది మొదలు ప్రతిపక్షలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి చేసే పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక, వెనుజులా అయిపోతుందంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పులు ఊబిలోకి నెడుతున్నాడంటూ చంద్రబాబు అనేక సందర్భాల్లో సీఎం జగన్  పై ఆరోపణలు చేశారు. మహిళకు, విద్యార్థుల, బీసీలకు, ఇతర సామాజిక వర్గాలక వారి కోసం సీఎం జగన్ తీసుకొచ్చిన  పథకాలపై చంద్రబాబు అనేక విష ప్రచారాలు చేశాడు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలకు రూ.45 వేల కోట్లు 50 కోట్లు అవుతుందని పలు సభల్లో బాబు ఆరోపించారు.

ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసిన.. జగన్ మాత్రం సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ మార్పులు చేయలేదు. అలా దాదాపు నాలుగున్నరేళ్లు గడిచింది… ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మాట, బాట జగన్ ను అనుసరించాడు. జగన్ చేపట్టిన పథకాలను అమలు చేస్తానంటూ మరికొన్న అదనపు స్కీమ్స్ ను ప్రవేశపెడాతను అంటూ చెప్పుకొచ్చారు. అలానే వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేమంటూ ఓ సభలో చెప్పారు. తాజాగా మంగళగిరిలో టీడీపీ, జనసేన కూటమి నిర్వహించిన జయహో బీసీ సభలో అనేక హామీలు ఇచ్చారు. పించన్ ను రూ.4 వేలకు పెంచుతున్నట్లు, అలానే బీసీలకు 50 ఏళ్లకే పించన్ ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.

అమ్మఒడి పథకానికి పేరు మార్చి…ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు వర్తించేలా చేస్తామని ప్రకటించారు. మరి.. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన చంద్రబాబు, ఆయన బాటలోకే వెళ్లారు. మొత్తంగా చంద్రబాబు మాటను, బాటను సీఎం జగన్ మార్చేశాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలానే చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు జరగాలంటే 85 వేల కోట్ల నుంచి 1.10 లక్ష కోట్లు అవుతాయని, మరి..వాటిని ఎక్కడి నుంచి తీసుకోస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా సీఎం జగన్..ప్రత్యర్థులన నుంచి ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా..వారి బాటనే తనవైపు మార్చుకునే చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి