iDreamPost

అబద్ధం చెప్పినా అతికెట్టుగా ఉండాలి బాబుగారు..!!

అబద్ధం చెప్పినా అతికెట్టుగా ఉండాలి బాబుగారు..!!

ప్రెస్‌మీట్‌లో ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. నిజా నిజాలు, ఆధారాలు అవసరం లేదు. చూపిస్తున్న ఆధారాలు వాస్తవమైనవా..? కాదా..? అనేది మీడియా ప్రతినిధులకు అనవసరం. చెప్పింది రాసుకుని పోవడమే వారి పని. ఆఖరున ప్రశ్నలు అడాలనుకుంటే అడుగుతారు. అంతేకానీ సదరు వ్యక్తి చెప్పిన మాటలు, చూపించిన ఆధారాల్లో నిజమెంత అనేది..? అక్కడ ప్రస్తావనకు రాదు. ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయాలు యథాతథంగా మీడియాలో వస్తుంది. అదే మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం అయితే.. క్రాస్‌ ఎగ్జామిన్‌ ఉంటుంది.

ప్రెస్‌మీట్లలో రాజకీయ నేతలు మాట్లాడేవి నిజమా.. అబద్ధమా అనేది కూడా పాఠకులు, వీక్షకులు పెద్దగా గమనించరు. ఎం చెప్పారో మాత్రమే గమనిస్తారు. అందుకేనేమో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్‌లో తనకు తోచింది చెబుతుంటారు. అందులో వాస్తవం ఎంత..? అనేది తర్వాత సంగతి. ముందు చంద్రబాబు చెప్పింది ప్రజలకు చేరుతుంది. ఇలానే.. నిన్న ప్రెస్‌ మీట్‌లో కియా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం రోజున వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అందరి ముందూ ఆ కంపెనీ ఉన్నతాధికారి మొఖంపై చేయి పెట్టి తీవ్రంగా బెదిరించి, అవమానించారంటూ ఆరోపించారు. అందుకు సాక్ష్యంగా ఓ ఫోటోను చూపించారు.

చంద్రబాబు చెప్పిన మాటల్లో నిజమెంత..? అనేది ఆయన సాక్ష్యంగా చూపించిన ఫోటోను గమనిస్తే చాలు ఇట్టే అర్థమవుతుంది. కియా ఉన్నతాధికారికి ఓ వైపున ఎంపీగోరంట్ల మాధవ్, మరో వైపున మరో మహిళా ప్రతినిధి ఉన్నారు. గోరంట్ల చేయి కంపెనీ ముఖ్య అధికారి వెనుక వైపున ఉంది. ఎంపీ మాధవ్‌ ఎదో చూపిస్తూ సదరు మహిళా ప్రతినిధిని అడుగుతున్నట్లుగా, దానికి ఆమె స్పందిస్తున్నట్లుగా.. స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫొటోను చూసిన ఎవరికైనా.. ఇట్టే తెలుస్తుంది. కానీ చంద్రబాబు ఈ ఫొటోను చూపిస్తూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కియా ముఖ్య అధికారిని బెదిరించారని చెప్పడం విడ్డూరంగా ఉంది. నిజా నిజాలతో సంబంధం లేకుండా.. చంద్రబాబు తాను అనుకున్నది చేసి.. ఫలితం పొందాలనుకుంటారనడానికి ఈ ఘటనే పెద్ద ఉదహారణ. కానీ అబద్ధం చెప్పినా.. అతికెట్టుగా ఉండాలి కదా..?!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి