iDreamPost

చంద్రబాబుకి షాకిచ్చిన జనం? ఆళ్లగడ్డ సభ అట్టర్ ఫ్లాప్!

Nara Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకే సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై విరుచుకపడుతున్నాడు. ఆయితే జనం మాత్రం చంద్రబాబు సభ అంటే భయంతో అక్కడి నుంచి పారిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాంటి ఘటనే ఆళ్లగడ్డ సభలో జరిగింది.

Nara Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకే సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై విరుచుకపడుతున్నాడు. ఆయితే జనం మాత్రం చంద్రబాబు సభ అంటే భయంతో అక్కడి నుంచి పారిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాంటి ఘటనే ఆళ్లగడ్డ సభలో జరిగింది.

చంద్రబాబుకి షాకిచ్చిన జనం? ఆళ్లగడ్డ సభ అట్టర్ ఫ్లాప్!

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. వేసవి కాలం రాకముందే.. ఆ స్థాయిలో రాజకీయ సెగలు రాష్ట్రంలో వీస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్షాలు అల్లాడిపోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ 175 స్థానాలే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా సభలు పెడుతూ అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని భావించారు. అయితే ఆయనకు ప్రజలే షాకిస్తున్నారు. ఇప్పటికే జరిగిన పలు టీడీపీ సభలు అట్టర్ ఫ్లాప్ గా.. తాజాగా ఆళ్లగడ్డలో జరిగిన సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రా కదలిరా’ సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇటీవలే  ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఈ సభ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాక ముందే.. జనలు అక్కడి నుంచి వెనుదిరిగారు. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన  రా కదలిరా సభ కూడా అట్టర్ ఫ్లాప్  అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వహిస్తామని, ప్రజా స్పందన బాగా వస్తుందని టీడీపీ నేతలు గొప్గా చెబుతూ వచ్చారు. కానీ తీర సభ జరిగే సరికి పదివేల మంది కూడా రాలేదు.  ఈ సభ కోసం నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం, నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా తెలుగు తమ్ముళ్లు చేరలేదు. రాయలసీమలోని వివిధ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తరలించాలని చెప్పినప్పటికి.. వారి నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ నాయకులు చేతులెత్తేశారు.

ఇక ఆళ్లగడ్డలో జరిగిన సభ కోసం సుమారు రూ. రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ స్థాయిలో ఖర్చు చేసినప్పటికీ టీడీపీ సభకు జనం రాకపోవడంతో  దిక్కుతోచని స్థితిలో పసుపు నాయకులు  ఉండిపోయారని టాక్ వినిపిస్తోంది. సభపై జనాలకే ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారని సమాచారం. ఇక చంద్రబాబు ప్రసంగంలో పసలేకపోవడంతో వచ్చిన ఆ నలుగురు జనం కూడా వెనుతిరుగుతున్నారు. కేవలం  సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తాము, ఏలా చేస్తాము అనే విషయాలను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేయలేదు. కేవలం వైఎస్ కుటుంబాన్ని విమర్శించడానికి సభలను ఏర్పాటు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే జనాలు సైతం చంద్రబాబు చేస్తున్న పస లేని ప్రసంగాన్ని నసగా భావించి.. మధ్యలోనే వెనుతిరుగుతున్నారు. దీంతో కేవలం కుర్చిలకు మాత్రమే చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. బిర్యానీ, మందు ఇచ్చిన జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలా మంది సభ నుంచి అర్థతంరంగా వెళ్లిపోయారు. ఇదే సభలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పట్టుకున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి ఏర్పడిన తరువాత నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరు కాలేదు.

ఇక ఆళ్లగడ్డ సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించకలేకపోతే..ఇక మీరెందుకంటూ స్థానిక నాయకులపై బాబు మండిపడినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే  సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. చంద్రబాబు ప్రసింగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. మొత్తంగా కనిగిరి సభ ప్లాప్ తరువాత ఆళ్లగడ్డలోనూ చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి.. ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి