iDreamPost

టీడీపీ ఒంటరిగా పోటీ చేయగలదు.. జనసేనకు కొన్ని సీట్లే..

నందమూరి చైతన్య కృష్ణ దాదాపు 20 ఏళ్ల తర్వాత బ్రీత్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిసెంబర్‌ 2వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది...

నందమూరి చైతన్య కృష్ణ దాదాపు 20 ఏళ్ల తర్వాత బ్రీత్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిసెంబర్‌ 2వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది...

టీడీపీ ఒంటరిగా పోటీ చేయగలదు.. జనసేనకు కొన్ని సీట్లే..

నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు నందమూరి చైతన్య కృష్ణ. 2003లో వచ్చిన ‘ధమ్‌’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే, ఈ చిత్రం తర్వాత ఆయన నటనకు దూరం అయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఆయన నటించిన ‘బ్రీత్‌’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చైతన్య కృష్ణ చిత్ర ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.

పలు సోషల్‌ మీడియా, మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య కృష్ణ టీడీపీ-జనసేన పొత్తుపై స్పందించారు. పొత్తుపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైతన్య కృష్ణ స్పందిస్తూ.. ‘‘ టీడీపీకి సొంత క్యాడర్‌ ఉందండి. సొంతంగా వెళ్లినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా కలిస్తే.. పొత్తు పెట్టుకుంటాం. వాళ్లకు కొన్ని సీట్లు ఇస్తాం. టీడీపీ సపోర్టు చేస్తానని పవన్‌ కల్యాణ్‌ గారు ముందుకు వచ్చారు’’ అని అన్నారు.

టీడీపీ.. జనసేనతో పొత్తు అవసరం లేదు అన్నట్లుగా ఉన్న చైతన్య కృష్ణ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి. పవన్‌, జనసేన అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటున్నావు అంటూ మండిపడుతున్నారు. కాగా, శనివారం బ్రీత్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. తాత ఎన్టీఆర్, నాన్నమ్మ బసవతారకం ఆశీస్సులతో సినీ పరిశ్రమలోకి వచ్చాను.

బ్రీత్ సినిమా మంచి మెసేజ్ ఉన్న చిత్రం కావడంతో సొంత బ్యానర్ పై నిర్మించాం. ఎన్టీఆర్ బసవతారకం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశాం. మంచి కథ ఉంటే సినిమా చేయాలని మా నాన్న జయకృష్ణ కూడా ప్రోత్సహించారు. కుటుంబ సంబంధాల కథాంశంతో ఈ సినిమా తీశాం. దర్శకుడు ప్రతి ఒక్కరిని గొప్పగా చూపించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ , గోపాల్ రెడ్డి మంచి హిట్ కాంబినేషన్. అలాగే మాది కూడా హిట్ కాంబినేషన్ కాబోతుందని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు.

ఇక, చైతన్య కృష్ణ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంపై నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ల లాగే సినిమాల్లో సక్సెస్‌ కావాలని ఆశీర్వదిస్తున్నారు. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బ్రీత్‌ సినిమా ఎలాంటి సక్సెస్‌ సాధిస్తుందో వేచి చూడాల్సిందే. మరి, నందమూరి చైతన్య కృష్ణ టీడీపీ-జనసేన పొత్తుపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి