iDreamPost

టెట్ అర్హత సాధించని వారికి ఇదే మంచి ఛాన్స్.. C-TET కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి

టీచింగ్ వృత్తిలోకి రావాలనుకునే వారు బీఈడీ, డీఈడీ వృత్తి విద్యా కోర్సులను చదవాల్సి ఉంటుంది. ఇక టీచర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే మాత్రం టెట్ క్వాలిఫై తప్పనిసరి. మరి మీరు ఇంకా టెట్ క్వాలిఫై అవ్వకపోతే సీటెట్ కు వెంటనే అప్లై చేసుకోండి.

టీచింగ్ వృత్తిలోకి రావాలనుకునే వారు బీఈడీ, డీఈడీ వృత్తి విద్యా కోర్సులను చదవాల్సి ఉంటుంది. ఇక టీచర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే మాత్రం టెట్ క్వాలిఫై తప్పనిసరి. మరి మీరు ఇంకా టెట్ క్వాలిఫై అవ్వకపోతే సీటెట్ కు వెంటనే అప్లై చేసుకోండి.

టెట్ అర్హత సాధించని వారికి ఇదే మంచి ఛాన్స్.. C-TET కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ డీఎస్సీకి పోటీ పడాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఒకసారి క్వాలిఫై అయితే జీవిత కాలం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెట్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాని వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్వాలిఫై అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల కోసం కోసం పోటీపడొచ్చు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను సంవత్సరానికి రెండుసార్లు (జులై, డిసెంబరు) జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. సీటెట్ నోటిఫికేషన్ మార్చి 05న రిలీజ్ అయ్యింది. టీచర్ ఉద్యోగార్థులు ఏప్రిల్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష తేదీ జూలై 7, 2024. కాగా కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-I- 1 నుండి 5వ తరగతి వరకు గల ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించబడుతుంది. పేపర్-II- 6 నుండి 12వ తరగతి వరకు గల ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించబడుతుంది. సీటెట్ లో అర్హత సాధించాలంటే కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. సీటెట్ లో సాధించిన స్కోరుకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది.

ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ), ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) వేరు వేరుగా పేపర్ 1, పేపరు 2 పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే ప్రైమరీ స్టేజ్ అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్ ఫీజు.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://ctet.nic.in/ను సందర్శించి మరింత సమాచారం పొందొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి