iDreamPost

రామమందిరానికి కేంద్రం విరాళం.. ఎంతో తెలిస్తే షాక్‌..

రామమందిరానికి కేంద్రం విరాళం.. ఎంతో తెలిస్తే షాక్‌..

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిన్న ట్రస్ట్‌ ఏర్పాటు చేయడంతో గుడి నిర్మాణానికి మొదటి అడుగు పడింది. ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించారు. ప్రభుత్వాలు, ప్రముఖులు, సంస్థలు, ప్రజలు రామ మందిరం నిర్మాణానికి విరాళాలు ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం మొదటగా స్పందించింది. రామ మందిర నిర్మాణానికి తన వంతుగా ఒక్క రూపాయి విరాళంగా ప్రకటించింది.

గత ఏడాది నవంబర్ 9వ తేదీన అయోధ్య లోని వివాదాస్పద స్థలాన్ని రామ మందిరానికి అప్పగిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ‘‘శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర’’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం నిన్న గురువారం వెల్లడించింది. దీనికి సుప్రిం కోర్టు సీనియర్‌ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్, ఆయోధ్య కేసులో రామ్‌లాల, హిందూ పక్షాల తరఫున వాదించిన కేశవ అయ్యంగార్‌ పరాశరన్‌ను చైర్మన్‌గా నియమించారు.

మొత్తం 15 మంది సభ్యులు గల ట్రస్ట్‌ కమిటీలో ఒక దళితుడు సభ్యుడుగా ఉండనున్నారు. వీరిలో 9 మంది శాశ్వత సభ్యులు, ఆరుగురు నామినేటెడ్‌ సభ్యులు ఉండనున్నారు. ఆలయ నిర్మాణం అంతా ట్రస్ట్‌ పర్యవేక్షణలో జరగనుంది. ఆయోధ్య చట్టం కింద ప్రాంగణం వెలుపల, బయట మొత్తం 67.703 ఎకరాలు ఈ ట్రస్ట్‌కు బదలాయించారు. మసీదు నిర్మాణానికి ప్రస్తుత స్థలానికి 18 కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి