iDreamPost

PM Surya Ghar Yojana: కోటి ఇళ్లకు ఉచిత సోలార్ విద్యుత్! కేంద్ర కేబినెట్ ఆమోదం!

గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ ఓ కీలక అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. అంతేకాక పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.  పీఎం సూర్య ఘర్ యోజన్ ముఫ్త్  బిజ్లీ యోజన స్కీమ్ కి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్ల నిధులతో కోటి గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ ను అందించనున్నారు. ఈ స్కీమ్ ద్వారా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.

2025 నాటి కేంద్ర కార్యాలయాలపై  సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ సూర్య ఘర్ యోజన  పథకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశ వ్యాప్తంగా  అర్హులైన కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ ను అందిస్తామని తెలిపారు. తాజాగా ఈ స్కీమ్ కి  కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి