iDreamPost

చంద్రబాబుకు ఆశల మీద నీళ్లు చల్లిన కేంద్రం?

చంద్రబాబుకు ఆశల మీద నీళ్లు చల్లిన కేంద్రం?

కరోనా వైరస్ సంక్షోభానికి సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు అండ్ కో కు కచ్చితంగా షాకిచ్చేదే. రెడ్ జోన్ లో నుండి ఆరు జిల్లాలను తప్పించింది. కేంద్రం ఈపని చేస్తుందని చంద్రబాబు, ఎల్లోమీడియా ఊహించలేదు. రెడ్ జోన్లను పట్టుకుని టిడిపి+ఎల్లోమీడియా జగన్ పై నానా యాగీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. మొన్నటి వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్ లో ఉంచింది. అలాంటిది తాజాగా రెడ్ జోన్ జిల్లాలు 6కు తగ్గిపోయింది.

రెడ్ జోన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వాదనకు కేంద్రం మార్గదర్శకాలకు చాలా వ్యత్యాసాలున్నాయి. జోన్ల గుర్తింపును మండలాల వారీగా చేయాలని మొదటి నుండి జగన్ సూచిస్తున్నాడు. అయితే కేంద్రం మాత్రం జిల్లాలనే యూనిట్ గా తీసుకుంటోంది. జగన్ చెప్పిన మండలాల ప్రకారం చూస్తే రాష్ట్రంలోని 85 శాతం గ్రీన్ జోన్లోనో ఉన్నాయి. అదే కేంద్ర మార్గదర్శకాల ప్రకారమైతే 80 శాతం రాష్ట్రం రెడ్ జోన్ లో ఉంది. సరే ఏదేమైనా వైరస్ తీవ్రతను తగ్గించటంలో జగన్ తీసుకుంటున్న అనేక చర్యల వల్ల వ్యాప్తి తీవ్రత, కేసుల తీవ్రత తగ్గినట్లే ఉంది. అందుకనే రెడ్ జోన్ పరిధిలో నుండి ఐదు జిల్లాలను తప్పించింది.

ఇక్కడ కేంద్రం తీసుకున్న నిర్ణయమే చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే కేసుల సంఖ్య పెరగటంలో నిజానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. టెస్టులు ఎక్కువగా చేస్తున్నరు కాబట్టే కేసులు బయటపడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా జగన్ చేతకానితనం వల్లే కేసులు పెరుగుతున్నాయంటూ బురద చల్లేస్తున్నారు. జగన్ వల్ల దేశంలో ఏపి పరువు పోయిందంటున్నారు. ఎలాగయ్యా అంటే తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలు ఏపి నుండి తమ రాష్ట్రాల్లోకి కేసులు రాకుండా సరిహద్దలు మూసేశాయట.

ఇక్కడే చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీద అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసులు ఏపిలోనే కాదు దేశమంతా పెరుగుతోంది. ఏపిలో కన్నా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కేసులు చాలా ఎక్కువున్నాయి. అలాగే జగన్ వైరస్ వ్యప్తిని నిరోధించలేకపోతున్నాడు కాబట్టి కేసులు పెరిగిపోతున్నాయంటూ ఒకటే గోల చేస్తున్నాడు. మరిపుడు చంద్రబాబు, ఎల్లోమీడియా వాదన తప్పని నిరూపిస్తు కేంద్రమే రెడ్ జోన్లను తగ్గించింది కదా ? మొత్తంమీద కేంద్రం తాజా నిర్ణయం చంద్రబాబు, ఎల్లోమీడియాకు షాకిచ్చిందనే చెప్పాలి.

అదే సమయంలో రాష్ట్రం వ్యవహారాలను చూస్తే మొత్తం టెస్టులు లక్షదాటింది. రోజుకు సగటున 7900 మందికి పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ప్రతిరోజు 82 మంది వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. రికవరీ శాతం కూడా 25 నుండి 27.55 శాతానికి పెరిగింది. పాజిటివ్ కేసులు 1.43 శాతం మాత్రమే. దేశం సగటు 3.87 శాతం అయితే ఏపిలో 2 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేసుల సంఖ్య 1463కి చేరుకోగా 33 మంది చనిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి