• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Cec Released Notifications For Mlc Elections

AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి

  • By Idream media Published Date - 07:35 AM, Tue - 9 November 21 IST
AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికకు నగారా మోగింది. ప్రస్తుతం మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, పలు పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీతో పోలింగ్‌ ముగుస్తుండగా.. తాజాగా ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేసింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మరుసటి రోజు అంటే 17వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి సుబ్బారెడ్డిని ఎన్నికల సంఘం నియమించింది.

పోలింగ్‌ లేనట్లే..

అసెంబ్లీలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండడంతో.. ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనమే కానుంది. ఏకగ్రీవంగానే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. 175 మంది ఎమ్మెల్యేలకు గాను వైసీపీకి 151 మంది సభ్యులున్నారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, టీడీపీ తరఫున గెలిచిన మద్ధాళి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ బలం 19కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తగినంత బలం లేని కారణంగా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి లేదు. దీంతో మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగానే గెలుచుకోనుంది.

స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానాలకు..

స్థానిక సంస్థల కోటాలోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆ రోజు నుంచి 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీన పరిశీలన చేయనున్నారు. 26వ తేదీన ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 10వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అత్యధిక స్థానాలను అధికార వైసీపీ గెలుచుకుంది. పలు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో టీడీపీ కనీసం బోణి కూడా చేయలేకపోయింది. దీంతో స్థానిక కోటాలో జరగనున్న 11 ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ సులువుగా గెలుచుకోవడం లాంఛనమే.

Also Read : Mini Municipal Elections – మినీ పోరు.. వైసీపీకి ఛాన్స్‌ ఇవ్వని టీడీపీ

Tags  

Related News

వీడియో: టోల్‌ ప్లాజా హర్రర్‌.. మహిళపై సిబ్బంది దాడి!

వీడియో: టోల్‌ ప్లాజా హర్రర్‌.. మహిళపై సిబ్బంది దాడి!

ఈ మధ్య కాలంలో ట్లోల్‌ ప్లాజాల వద్ద దారుణాలు బాగా పెరిగిపోయాయి. యాక్సిడెంట్లు.. గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, ఓ టోల్‌ ప్లాజా వద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళపై టోల్‌ ప్లాజా సిబ్బంది దాడికి దిగారు. భర్త కళ్లముందే ఆమెను దారుణంగా చితకబాదారు. భర్తను కూడా వదల్లేదు. తాగి నడుపుతున్నారన్న కారణంతో ఈ ఘాతుకానికి తెగించారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనిపత్‌కు చెందిన ఓ […]

6 mins ago
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో స్టాఫ్ నర్సు పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో స్టాఫ్ నర్సు పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

18 mins ago
ఉదయనిధిని చిన్నపిల్లాడ్ని చేసి వెంటాడుతున్నారు : కమల్ హాసన్

ఉదయనిధిని చిన్నపిల్లాడ్ని చేసి వెంటాడుతున్నారు : కమల్ హాసన్

20 mins ago
షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!

షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!

25 mins ago
వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేది బాబర్‌ అజమ్‌! కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన గంభీర్‌

వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేది బాబర్‌ అజమ్‌! కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన గంభీర్‌

44 mins ago

తాజా వార్తలు

  • వీడియో: రంగుల రాట్నంలో ఇరుక్కున్న మహిళ జుట్టు!
    1 hour ago
  • ఆసీస్‌తో మ్యాచ్‌ తర్వాత.. అశ్విన్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌! ఎందుకు ఇదంతా?
    1 hour ago
  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘వదినమ్మ’ సీరియల్ నటి!
    1 hour ago
  • ప్రధాని మోడీకి అరుదైన బహుమతిని అందజేసిన సచిన్!
    1 hour ago
  • ఇప్పుడు టీమిండియా సూపర్‌ గా కనిపిస్తుందా? కానీ, ఒక పెద్ద మైనస్‌ ఉంది!
    2 hours ago
  • ఆటోలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ షికార్లు.. వీడియో వైరల్!
    2 hours ago
  • ఢిల్లీకే పరిమితమైన లోకేష్‌.. అరెస్ట్‌ చేస్తారనే భయమా?
    2 hours ago

సంఘటనలు వార్తలు

  • బ్రాహ్మ‌ణి వైపు తమ్ముళ్ల చూపు! లోకేశ్‌ని లైట్ తీసుకున్నారా?
    2 hours ago
  • అట్లీ – అల్లు అర్జున్ కాంబో! ఏది తేల్చి చెప్పరేం..?
    2 hours ago
  • బాలకృష్ణ తీరుపై అచ్చెన్న ఆవేదన! ఇదేమి మర్యాద?
    2 hours ago
  • Bigg Boss 7 Telugu: మూడో వారం హౌస్ నుంచి ఆ బ్యూటీనే ఎలిమినేషన్!
    2 hours ago
  • వరల్డ్ కప్ ముందు చిక్కుల్లో రోహిత్‌ శర్మ! ఇలా అయ్యిందేంటి?
    2 hours ago
  • CID కస్టడికి చంద్రబాబు.. పవన్‌ మౌనం.. అసలేం జరుగుతోంది?
    3 hours ago
  • జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్!
    3 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version