iDreamPost

Cauliflower : క్యాలిఫ్లవర్ రిపోర్ట్

Cauliflower : క్యాలిఫ్లవర్ రిపోర్ట్

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అందరి కన్ను రాజ్ తరుణ్ అనుభవించు రాజా మీదే ఎక్కువ ఉండిపోయింది కానీ ఒక వర్గం ప్రేక్షకులు సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ మీద కూడా ఆసక్తి చూపించారు. గతంలో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సర్ప్రైజింగ్ హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేసిన సంపూ ఈసారి కూడా ఏదో ఒక ఎంటర్ టైన్మెంట్ ఇస్తాడనే నమ్మకంతో థియేటర్లకు వెళ్లిన వాళ్ళు ఉన్నారు. మగాడు శీలం పోగొట్టుకోవడమనే పాయింట్ మీద దీన్ని రాసుకున్నట్టు ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఫుల్ కామెడీ ఖాయమనే నమ్మకంతో ఆడియన్స్ దీన్ని కూడా ఛాయస్ గా పెట్టుకున్నారు. మరి ఇదెలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

అండీ ఫ్లవర్(సంపూర్ణేష్ బాబు)విదేశీయుడు. భారతీయ స్త్రీలు ఎంతో గొప్పవారని తెలుసుకుని ఇక్కడి అమ్మాయినే కోరి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఇతని మనవాడే క్యాలీఫ్లవర్(సంపూర్ణేష్ బాబు). అఫ్కోర్స్ కొడుకు కూడా ఆయనే లెండి. తాత అడుగు జాడల్లో నడుస్తూ 35 వయసు వచ్చాకే పెళ్లి చేసుకోవాలని నిగ్రహంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు క్యాలీఫ్లవర్. ఈలోగా ఓ అనూహ్యమైన సంఘటన జరిగి ఇతన్ని ముగ్గురు అమ్మాయిలు మానభంగం చేస్తారు. దీంతో జరగరాని ఘోరం జరిగిందని రోడ్డుకెక్కుతాడు క్యాలీఫ్లవర్. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, రేప్ కు జస్టిస్ దొరికిందా లేదా అనేది తెరమీద చూడాలి.

స్పూఫ్ కామెడీలో లాజిక్స్ ఉండవు నిజమే. అల్లరి నరేష్ సుడిగాడు నుంచి ఇప్పటి సంపూ సినిమాల దాకా ఇది ఎన్నోసార్లు ఋజువయ్యింది. అలా అని తలా తోకా లేకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి జోకులతో నింపేస్తే జనాలు నిర్మొహమాటంగా తిప్పి కొడతారు.సంపూర్ణేష్ తనవంతుగా నవ్వించే ప్రయత్నం శతవిధాలా చేశాడు. కానీ దర్శకుడు ఆర్కె మలినేని పేలవమైన కథా కథనాలతో క్యాలీఫ్లవర్ ఏ మాత్రం ఆసక్తికరంగా సాగదు. మొత్తం మీద ఆసక్తిగా అంతోఇంతో పర్లేదు అనిపించే భాగం ఓ అయిదు శాతం ఉంటుంది అంతే. మిగిలినదంతా మినిమమ్ టైం పాస్ కు సైతం ఉపయోగపడలేదు. చెవిలో ఫ్లవర్ తప్ప ఈ క్యాలీఫ్లవర్ ఇచ్చిందేమి లేదు

Also Read : Real Star Srihari : రియల్ స్టార్ ని సృష్టించిన మాస్ డైరెక్టర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి