iDreamPost

ఇకపై ఇలా పెళ్లి చేసుకునే యువతులకు ప్రభుత్వం రివార్డ్!

ఇకపై ఇలా పెళ్లి చేసుకునే యువతులకు ప్రభుత్వం రివార్డ్!

సమస్యకు ఏదో విధంగా పరిష్కారం  కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాగే చైనా కూడా ఇప్పుడు ఓ సమస్యతో అల్లాడిపోతుంది. అందుకే తరచూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా తగ్గిపోతోన్న జననాల రేటుతో చైనా కలవరపడుతోంది. వివాహాలు, జనాభా పెరుగుదల కోసం స్థానిక ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు  ప్రకటిస్తున్నాయి. తాజాగా యువతుల పెళ్లి విషయంలో  చైనాలోని ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతలకు రివార్డ్ అందనుంది. చైనాలోని జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ  ఈ మేరకు నిర్ణయం  తీసుకుంది.

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం అంటే చైనా అని ఇప్పటి వరకు చెప్పుకునే వాళ్లం. కానీ పరిస్థితులు మారిపోయాయి. అక్కడి జననాల రేటు అనుకున్న స్థాయి కంటే దారుణంగా పడిపోతుంది. దీంతో అక్కడి ప్రభుత్వంలో కలవర పాటు మొదలైంది. ఒక దేశాభివృద్ధికి మానవ వనరులు అతిప్రధానమైనవి అనే విషయం తెలిసిన చైనా.. జననాల రేటును పెంచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా 25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే యువతులకు రివార్డ్ ప్రకటించింది.

జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యువతులు తగిన వయసులో పెళ్లి, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిని అందించనుంది. దీని ప్రకారం తొలి వివాహం చేసుకునే  25 ఏళ్ల యువతులకు 1000 యువాన్లు  అంటే మన కరెన్సీలో సుమారు రూ.11,500 ఇవ్వనుంది. ఆ తరువాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహరకించనుంది. చైనాలో స్త్రీల కనీస వివాహ వయస్సు 20 కాగా, పురుషులకు 22  ఏళ్లుగా ఉంది. ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడటం, జీవన ఖర్చులు భారీగా పెరగడం, అలానే సమాజంలో మార్పులు వంటి కారణాలతో పెళ్లి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.

2022లో చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021తో పోలీస్తే..2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గింది. 2021లో 7.63మిలియన్ల జంటలు పెళ్లి చేసుకోగా.. అదే 2022లో 6.8 మిలియన్లు మాత్రమే పెళ్లిళ్లు చేసుకున్నట్లు నివేదికలో తెలిపింది.అలానే సంతానోత్పత్తి రేటు కూడా అతి తక్కువగా ఉంది. 2022లో అది 1.09కి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. ఇలాంటి తరుణంలో జననాల రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం, స్థానిక యంత్రాంగాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. మరి… జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటి  ప్రకటించిన ఈ రివార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అందరూ చూస్తుండగా మహిళపై దూసుకెళ్లిన రైలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి