iDreamPost

Agnipath Scheme : ఆర్మీ ఉద్యోగాలు కష్టమేనా ? విధ్వంసకారకులపై 14 సెక్షన్ల కింద కేసులు.. నేరం రుజువైతే ?

ఈ క్రమంలో తమ పరీక్షను రద్దు చేశారన్న కోపంలో సృష్టించిన విధ్వంసానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిన్న ఆందోళనకారులు చేసిన విధ్వంసానికి జీఆర్పీ పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇరుక్కుంటే..

ఆర్మీలో ఉద్యోగాల కోసం వారంతా చాలా కష్టపడ్డారు. సగం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. రన్నింగ్, లాంగ్ జంప్ వంటి వాటన్నింటిలోనూ శిక్షణ పొంది ఉన్నారు. ఈ క్రమంలో తమ పరీక్షను రద్దు చేశారన్న కోపంలో సృష్టించిన విధ్వంసానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిన్న ఆందోళనకారులు చేసిన విధ్వంసానికి జీఆర్పీ పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇరుక్కుంటే.. ఆర్మీ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకూ ఇబ్బందులు తప్పవు.

నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసకాండలో నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ గాయాల కారణంగా వారు ఇదివరకటిలా రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ వంటివి చేయడం కష్టమేనని వైద్యులు పేర్కొన్నారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేసిన కారణంగా ఆ నలుగురిపై ఐపీసీ, ఐఆర్ఏ (Indian Railway Act) లోని 14 సెక్షన్ల కింద కేసులు బనాయించారు. ఐఆర్ఏలోని సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి. చాలా వరకూ నాన్ బెయిలబుల్ సెక్షన్లే. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితులకు యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి