iDreamPost

MPC విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా B.Tech.. ఆపై ఉద్యోగం కూడా!

ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 51) ద్వారా ఇంటర్ ఎంపీసీ చదివి ఉత్తీర్ణులై, దీంతోపాటు జేఈఈ మెయిన్స్ క్వాలిఫైయర్ అభ్యర్థుల కోసం 51వ కోర్సు ద్వారా ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 51) ద్వారా ఇంటర్ ఎంపీసీ చదివి ఉత్తీర్ణులై, దీంతోపాటు జేఈఈ మెయిన్స్ క్వాలిఫైయర్ అభ్యర్థుల కోసం 51వ కోర్సు ద్వారా ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

MPC విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా B.Tech.. ఆపై ఉద్యోగం కూడా!

ఈ రోజుల్లో చదువు ఎంతో వ్యయంతో కూడుకున్నదిగా తయారయ్యింది. చదువుకోవాలంటే చదువు కొనాలి అనే పరిస్థితికి వచ్చింది. కొంత మంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ పేదరికం కారణంగా చదువకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ విద్యార్థులకు శుభవార్తను అందించింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం. ఎంపీసీ విద్యార్థులకు ఉచితంగా బీటెక్ చదువు చెప్పించి ఆ తర్వాత ఉద్యోగం కూడా కల్పించనుంది. ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌ Indianarmy.nic.in లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది.

ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 51) ద్వారా ఇంటర్ ఎంపీసీ చదివి ఉత్తీర్ణులై, దీంతోపాటు జేఈఈ మెయిన్స్ క్వాలిఫైయర్ అభ్యర్థుల కోసం 51వ కోర్సు ద్వారా ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీలో ఖాళీగా ఉన్న 90 పోస్టులను భర్తీ చేయడం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం. ఎంపికైన వారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ నాలుగేళ్లు ఉంటుంది. కాగా 2024 జులై నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. సక్సెస్ ఫుల్ గా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ పట్టాతో పాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం ఇస్తారు. విధుల్లో చేరినవారికి లెవెల్‌-10 ప్రకారం నెలకు 1 లక్ష రూపాయల వరకూ జీతం ఉంటుంది.

ఎంపిక విధానం 

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం అభ్యర్థుల ఎంపికను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ) యొక్క ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ జేఈఈ మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది, ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో, అభ్యర్థులు ఇంటెలిజెన్స్ టెస్ట్ మరియు పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ (PPDT)కి హాజరు కావాలి. మొదటి దశలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే రెండో దశలో పాల్గొనే అవకాశం ఉంటుంది. రెండో దశలో అభ్యర్థులు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.

శిక్షణ నాలుగేళ్లు

ఈ కోర్సులో భాగంగా మొత్తం శిక్షణ నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో రెండు దశలుంటాయి.. ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్‌.. ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మొదటి మూడేళ్లు బేసిక్‌ మిలటరీ ట్రైనింగ్, బీటెక్‌ టెక్నికల్‌ శిక్షణను.. పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. తర్వాత ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ – డెహ్రాడూన్ లో ఈ శిక్షణ ఉంటుంది. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ ఇస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదా పొందొచ్చు. శిక్షణ, కోర్సు పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) ప్రదానం చేస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు. పూర్తి వివరాలకు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం.

మొత్తం ఖాళీలు: 90

అర్హత:

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్‌-2023 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.

వయసు:

16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2005 – జనవరి 1, 2008 మధ్య జన్మించాలి.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ

13-10-2023

దరఖాస్తులకు చివరితేది :

నవంబర్‌ 12 2023

అధికారిక వెబ్ సైట్

Indianarmy.nic.in

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి