iDreamPost

MS Dhoni: దేశం కోసం ధోని గొప్ప నిర్ణయం.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు!

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్రసింగ్ ధోనికి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రశంసలు పొందుతోంది.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్రసింగ్ ధోనికి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రశంసలు పొందుతోంది.

MS Dhoni: దేశం కోసం ధోని గొప్ప నిర్ణయం.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు!

మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్రలోకి ఎక్కాడు. 2011 వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ తో పాటుగా ఓ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు అందించాడు. కాగా.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా, ధోనికి మాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రశంసలు పొందుతోంది.

సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత నెక్ట్స్ మీ ప్లానింగ్ ఏంటి? అన్న ప్రశ్నకు కామెంట్రీ ఇస్తామనో, లేదా క్రికెట్ అకాడమీ పెడతామనో, లేదా కోచ్ గా మారుతామనో చాలా వరకు సమాధానాలు ఇస్తారు. ఇక ఇదే క్వశ్చన్ ను టీమిండియా మిస్టర్ కూల్ ధోనిని అడిగితే.. అతడు చెప్పిన సమాధానం విని దేశం మెుత్తం ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ధోని చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మహేంద్ర సింగ్ ధోని ఓ కార్యక్రమానికి హాజరైయ్యాడు. ఈ ఈవెంట్ లో క్రికెట్ నుంచి పూర్తిగా విరామం తీసుకున్నాక.. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? అని ప్రశ్న ఎదురైంది. దీనికి ధోని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

“ఈ ప్రశ్న గురించి నేను ఇప్పటి వరకు పెద్దగా ఆలోచించింది లేదు. ఎందుకంటే? నేనింకా క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి. ఇక క్రికెట్ నుంచి పూర్తిగా విరామం తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అన్న ఆలోచన నాక్కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది. అయితే నేను క్రికెట్ కు దూరం అయ్యాక ఎక్కువ సమయాన్ని ఆర్మీలో గడపాలనుంది. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆర్మీకి తగిన టైమ్ కేటాయించలేకపోయాను. ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఆర్మీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తాను” అంటూ ఆన్సర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ధోని చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉండగా.. భారత క్రికెట్ కు అపూర్వ సేవలు అందించినందుకు గాను ధోనికి 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ను ఇచ్చింది. 2015లో ధోని ట్రైనింగ్ క్యాంప్ లో సైతం పాల్గొని, 2019లో కశ్మీర్ లో విధులు కూడా నిర్వర్తించాడు. ఇక గతంలో ఎన్నోసార్లు తనకు సైనికుడు కావాలని ఉన్నట్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. సైనికులను చూస్తున్నప్పుడల్లా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని అనుకున్నాడట ధోని. మరి దేశం కోసం ఆర్మీలో ఎక్కువ సమయం కేటాయిస్తానన్న ధోని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి