iDreamPost

వీడియో: తప్పుకోమమని హారన్ కొడితే.. వెంబడించి దాడి చేశారు!

వీడియో: తప్పుకోమమని హారన్ కొడితే.. వెంబడించి దాడి చేశారు!

సాధారణంగానే ఇప్పుడు నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. అది కూడా మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే ఇంటి నుంచి బయటకు వస్తే.. తిరిగి ఎప్పుడు మళ్లీ ఇంటికి వస్తాం అనేది చెప్పలేని పరిస్థితి. ఇంక రోడ్డు మీదకు వచ్చాక కార్లు, బైకులు, బస్సులు అంటూ నానా హంగామా ఉంటుంది. ఎవరికి వాళ్లు వెంటనే వెళ్లిపోవాలి అనే హడావుడిలో రూల్స్ మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు అయితే మీ హారన్ కు బాగా పనిచెప్పాల్సి వస్తుంది. అలాగే ఒక యువకుడు కారులో వెళ్తే హారన్ కొట్టాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు అయిపోయింది.

సాధారణంగా మనం రోడ్డు మీదకు వచ్చిన తర్వాత రోడ్డు రద్దీగా ఉన్నా.. ఎవరైనా బండికి అడ్డుగా ఉన్నా హారన్ కొడతాం. అలాగే ఈ యువకుడు కూడా బైకర్ అడ్డుగా ఉంటే హారన్ కొట్టాడు. అయితే ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి పక్కకు తప్పుకోలేదు. తప్పుకోవడం లేదని మళ్లీ హారన్ కొట్టాడు. అతనికి తోడు ఇంకో స్కూటీ వ్యక్తి కూడా కారుకు అడ్డు రావడం ప్రారంభించాడు. కారు ముందుకు వెళ్లకుండా తమ వాహనాలను అడ్డుగా పెడుతూ వచ్చారు. ఆఖరికి కారు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా బండ్లను అడ్డుగా ఆపేశారు.

ఆ తర్వాత మూడో వ్యక్తి స్కూటీతో వచ్చి కారుని ఢీకొట్టాడు. ఈ మొత్తం దృశ్యాలు కారులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కారును రివర్స్ చేసుకుని ఆ వ్యక్తి యూటర్న్ తీసుకుని వెళ్లిపోయాడు. అక్కడితో వ్యవహారం సదదుమణిగింది అనుకున్నారు. కానీ అక్కడే అసలు విషయం మొదలైంది. మొత్తం నలుగురు బైకర్లు కారుని వెంబడించారు. అతను ఒక అపార్టుమెంట్ దగ్గర కారు అపగా.. కారుని చుట్టుముట్టారు. కారు అద్దాలు, విండ్ షీల్డ్ ని ధ్వంసం చేశారు. కారులో ఉన్న వారిపై దాడికి దిగారు. చుట్టుపక్కల వాళ్లు అంతా వచ్చి వారిని ఆపేందుకు ప్రయత్నించినా కూడా వినలేదు. ఈ మొత్తం అపార్టుమెంట్ సెల్లార్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఈ ఘటనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాష్ కెమెరా లేకుండా బెంగళూరు వీధుల్లోకి వెళ్లే పరిస్థితి లేదంటూ చెబుతున్నారు. కొందరు కావాలనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అలా దాడి చేసి కారులో ఉండే వస్తువులు, డబ్బు దొంగిలించేందుకు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ట్విట్టర్లో స్పందించారు. దాడికి దిగిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనల్లో వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేస్తారని భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి