iDreamPost

సియం జగన్ తో రాజదాని రైతుల భేటీ

సియం జగన్ తో రాజదాని రైతుల భేటీ

అమరావతి ఉద్యమంలో 49 రోజులనుండి రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజదాని ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లు ఆర్కే, ఉండవల్లి శ్రీదేవి లు కూడా ముఖ్యమంత్రి ని కలవడానికి వచ్చిన బృందంలో ఉన్నారు. ఇటీవలే నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు మందడంలో దీక్ష చేస్తున్న రైతులను కలసి వారితో మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు ఆప్రాంత రైతులు మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు.

ప్రధానంగా రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంలో ముఖ్యమంత్రితో భేటీలో ఆ ప్రాంత రైతులు నష్టపోకుండా వారికి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించే అవకాశం వుంది. రెండు రోజుల క్రితం వైసిపి కి చెందిన ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు మందడం గ్రామంలో దీక్ష చేస్తున్న రైతులను కలసిన సందర్భంలో ప్రభుత్వం ఒక కమిటీ ని ఏర్పాటు చేసి ల్యాండ్ పూలింగ్ కి భూములిచ్చిన రైతులతో చర్చించే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులతో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అర్ధమౌతుంది.

అయితే రాజదాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు ఢిల్లీ లోని కేంద్ర పెద్దలతో పాటు ఉప రాష్ట్రపతిని కలుస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి తో కొందరు రాజదాని ప్రాంత రైతుల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి