iDreamPost

పిల్లలు లేరని బాలుడిని దత్తత తీసుకున్నారు.. చివరికి వాళ్లే చంపేశారు!

పిల్లలు లేరని బాలుడిని దత్తత తీసుకున్నారు.. చివరికి వాళ్లే చంపేశారు!

పెళ్లైన కొంతమంది భార్యాభర్తలకు పిల్లలు కలగడం లేదు. దీంతో వాళ్లు ఎన్నో ఆస్పత్రులు , దేవాలయాల చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కానీ, చివరికి వారికి పిల్లలు మాత్రం కలగడం లేదు. దీంతో చేసేదేం లేక ఇతర పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ దంపతులకు పిల్లలు లేకపోవడంతో గతంలో ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. ఆ బాలుడిని చాలా కాలం నుంచి పెంచుకుంటున్నారు. కట్ చేస్తే.. చివరికి అదే దంపతులు ఆ బాలుడిని దారుణంగా హింసించి హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ మీడియా కథనం ప్రకారం.. అమెరికాలోని బెల్మాంట్ లో జాకబ్ బలోబెర్టి-లారెన్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లై చాలా ఏళ్లు గడిచినా వీరికి పిల్లలు కలగలేదు. దీంతో ఈ దంపతులు పెన్సిల్వేనియాకు చెందిన లాండన్ (5) అనే బాలుడిని గతంలో దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ఆ బాలుడిని పెంచారు. ఇదిలా ఉంటే.. ఈ భార్యాభర్తలు లాండన్ ను గత కొంత కాలం నుంచి తీవ్ర హింసకు గురి చేసినట్లు తెలుస్తుంది. బాలుడు అని చూడకుండా ఈ జంట ఏ వస్తువు కనపడితే దానితో కొట్టేవారట.

ఇకపోతే.. జనవరి 30న తీవ్ర గాయలతో ఉన్న లాండన్ ను ఈ దంపతులు  ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. ఆ బాలుడి మెడకు, తలకు తీవ్రమైన గాయాలు అయినట్లు డాక్టర్లు గుర్తించి చికిత్స అందించడం మొదలు పెట్టారు. అయితే ఈ బాలుడు ఆస్పత్రిలో ఉన్న సమయంలో జాకబ్, లారెన్ భార్యాభర్తలు గో ఫండ్ ద్వారా ఇతరుల నుంచి 5వేల డాలర్లకు పైగా నిధులు సేకరించారట. కాగా ఈ బాలుడు చికిత్స పొందుతూ ఫిబ్రవరి 7న ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 అయితే ఆ రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. తీవ్ర గాయాలతోనే లాండన్ మరణించినట్లు ఆ రిపోర్టులో తేలింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ దంపతులు నివాసం ఉంటున్న ఇంటి పక్క వాళ్లను ప్రశ్నించగా.. జాకబ్,లారెన్ జంట ఆ బాలుడిని చిత్ర హింసలకు గురి చేసి తీవ్రంగా కొట్టేవారని తెలిపారు. దీంతో పోలీసులు ఎట్టకేలకు ఇటీవల ఆ బాలుడిని దత్తత తీసుకున్ని జాకబ్ బలోబెర్టి, లారెన్ దంపతులకు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: మరో 15 రోజుల్లో బర్త్ డే.. అంతలోనే ఊహించని విషాదం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి