iDreamPost

గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

  • Published Jan 29, 2024 | 1:26 PMUpdated Jan 29, 2024 | 1:26 PM

Plane Crash: ఈమధ్య కాలంలో తరచుగా ఏదో ఓ చోట విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా నేడు కూమా మరో విమాన ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Plane Crash: ఈమధ్య కాలంలో తరచుగా ఏదో ఓ చోట విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా నేడు కూమా మరో విమాన ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jan 29, 2024 | 1:26 PMUpdated Jan 29, 2024 | 1:26 PM
గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని రకాల ప్రమాదాలను చూస్తేంటే.. ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. ప్రమాదాల సంగతి అటుంచితే.. నేటి కాలంలో కొందరు ఫేమస్‌ అవ్వడం కోసం రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా ఓ ఆశ్చర్యకరమైన ప్రమాదానికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే భయంతో ఒణికిపోతారు. ఇంతకు ఆ ప్రమాదం ఏంటి అంటే.. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ విమానం గాల్లో ఉండగానే ముక్కలై  కుప్ప కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంతకు ఈ విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే..

బ్రెజిల్‌లోలోని మినాస్ గెరైస్ అనే రాష్ట్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణం ప్రారంభించిన ఓ చిన్న విమానం.. కొన్ని క్షణాల వ్యవధిలోనే.. గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలింది. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సావోపాలో అనే రాష్ట్రంలో క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన ఈ విమానం కాసేపటికే.. ప్రమాదానికి గురైంది. గాల్లో ఉండగానే ఒక్కసారిగా ముక్కలై కుప్పకూలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నారు.

The plane crashed into pieces in the air

అయితే ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. యాక్సిడెంట్‌కి కారణం సాంకేతిక లోపమా లేక ఏదైనా జరిగిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విమానం ఓ గుట్టపై కూలినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారం రానుంది అంటున్నారు అధికారులు.

ఐదు రోజుల క్రితం కెనడాలో కార్మికులతో వెళ్తోన్న ఓ చిన్న విమానం టెకాఫ్‌ అయిన కాసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానం ఓ చార్టెడ్‌ ఫ్లైట్‌ అని అధికారులు తెలిపారు. ఇక ఈనెల ప్రారంభంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్‌ ఓలివర్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరు ప్రయాణించిన చార్టెడ్‌ ఫ్లైట్‌ కరేబియన్‌ సముద్రంలో కుప్పకూలింది. ఇలా ఈ నెల ప్రారంభం నుంచి వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రయాణికులను భయపెడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి