iDreamPost

ఆశ్చర్యపరుస్తున్న బ్రహ్మాస్త్ర వసూళ్లు

ఆశ్చర్యపరుస్తున్న బ్రహ్మాస్త్ర వసూళ్లు

బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్న లెక్కల ప్రకారం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మొదటి వీకెండ్ గ్రాస్ 225 కోట్లు వచ్చిందట. ఇది ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాని పెద్ద రికార్డు. టాక్ డివైడ్ గా ఉన్నా, తరన్ ఆదర్శ్ లాంటి సీనియర్ మోస్ట్ విశ్లేషకులు టూ రేటింగ్ తో చిత్రం తమను తీవ్రంగా నిరాశపరిచిందని రివ్యూలు ఇచ్చినా కలెక్షన్లు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఓన్ చేసుకున్న తీరు అక్కడి ట్రేడ్ కి రిలీఫ్ ఇచ్చింది. ఇదే జోరు కొనసాగితే ఆల్ టైం రికార్డులు ఖాయమంటున్నారు కానీ ఇవాళ నుంచే గణనీయమైన డ్రాప్ సౌత్ సర్కిల్స్ లో కనిపిస్తోంది. మంచి దూకుడు చూపించిన తెలుగు తమిళ వెర్షన్లు నెమ్మదించాయి.

గ్రాఫిక్ కంటెంట్ చిన్నపిల్లలను బాగా ఆకట్టుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బ్రహ్మాస్త్రకు బాగా దక్కుతోంది. నిన్నా మొన్న హౌస్ ఫుల్ బోర్డులకు కారణం అదే. హిందీలో ఇంకో మూవీ ఏదీ పోటీకి సాహసించకపోవడంతో సోలో రన్ తో తిరుగులేకుండా పోయింది. ఆదివారం సెలవుని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి 12 తర్వాత పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీ ప్లెక్సులు స్పెషల్ షోలు వేయడం చూస్తే మొదటి వారాంతంలోనే వీలైనంత రాబట్టుకునే లక్ష్యం కనిపిస్తోంది. ఈ రెండు కంపెనీలకు బ్రహ్మాస్త్ర వల్ల నష్టాలు వచ్చాయని తొలుత ప్రచారం జరిగినప్పటికి అదేమీ లేదని దేశవ్యాప్తంగా మంచి వసూళ్లతో స్టడీగా ఉందని సిఈవి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఇక తెలుగు విషయానికి వస్తే దీని వల్లే పాజిటివ్ టాక్ వచ్చిన ఒకే ఒక జీవితంకు ఫస్ట్ డే చాలా నెమ్మదిగా సాగింది. నిన్నటి నుంచి ఆక్యుపెన్సీ పెరిగింది కానీ అది ఎంత మేరకు కంటిన్యూగా నిలబడుతుందనే దాన్నిబట్టి సక్సెస్ ఆధారపడి ఉంది. 8 కోట్లకే థియేట్రికల్ బిజినెస్ చేశారు కాబట్టి బ్రేక్ ఈవెన్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఆ మేరకు దాటేసిన బ్రహ్మాస్త్ర బయ్యర్లకు లాభాలు ఇచ్చినట్టే. హంగులతో పాసై పోయింది కానీ కంటెంట్ విషయంలో మాత్రం దీనికి విమర్శలు తప్పలేదు. ప్రెజెంటేషన్ ఇంకా మెరుగ్గా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఈ వారం ఫిగర్స్ కీలకం కానున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి