iDreamPost

ఆ సమస్యతో బాధ పడుతున్న ఆలియా భట్‌.. ప్రతి వారం ఆస్పత్రికి

  • Published Apr 23, 2024 | 12:20 PMUpdated Apr 23, 2024 | 1:10 PM

శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందులోను ముఖ్యంగా స్త్రీలకు మానసిక ఆరోగ్యం అనేది ఎంతో అవసరం. ఈ క్రమంలో తాజాగా.. ప్రముఖ నటి అలియా భట్ మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది.

శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందులోను ముఖ్యంగా స్త్రీలకు మానసిక ఆరోగ్యం అనేది ఎంతో అవసరం. ఈ క్రమంలో తాజాగా.. ప్రముఖ నటి అలియా భట్ మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Apr 23, 2024 | 12:20 PMUpdated Apr 23, 2024 | 1:10 PM
ఆ సమస్యతో బాధ పడుతున్న ఆలియా భట్‌.. ప్రతి వారం ఆస్పత్రికి

ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు బి టౌన్ లోను, ఇటు తెలుగు నాట కూడా అలియా భట్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె ఏప్రిల్ 14,2022 లో రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. వారికి అదే ఏడాది రాహా జన్మించింది. అయితే సాధారణంగా చాలా వరకు తల్లులందరూ కూడా పిల్లలు పుట్టిన తర్వాత.. మానసికంగా శారీరకంగా వారి జీవితాలలో చాలా మార్పులు చూస్తుంటారు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే వారు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తూ ఉంటారు. కానీ, అలియా కాస్తా డిఫ్ఫరెంట్.. ఇటు ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా.. సినిమాలు చేస్తూ… అదే అందాన్ని మైంటైన్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే తానూ ఎలాంటి జాగ్రత్తలు వహించాను అనే విషయాలను, అలాగే కొత్త తల్లులు తమ శారీరిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా అలియా భట్ పంచుకుంది.

సాధారణంగా ఎవరికైనా కూడా ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత.. శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమాలో నటించాలంటే వారికి ఉండవలసిన అతి ముఖ్యమైన వాటిలో గ్లామర్ గా కనిపించడం కూడా ఒకటి. అయితే ఈ విషయంలో మాత్రం అలియా భట్ ను మెచ్చుకోకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అదే అందం, గ్లామర్ ను మైంటైన్ చేస్తుంది. తాజాగా అలియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక పక్క సినిమాలలో అనేక రోల్స్ లో కనిపిస్తూ.. మరోపక్క తన బిడ్డ విషయంలో బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నానా లేదా అనే సందేహాలు.. భయాలు తరచూ ఆమెను వేధిస్తూనే ఉంటాయని.. ప్రతి మహిళా కూడా ఇటువంటివి ఎదుర్కోక తప్పదని ఆమె పేర్కొంది.

అలా అని దానిని తేలికగా తీసుకోకూడదని కూడా చెబుతోంది. అందుకే ఈ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి .. మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆమె చెబుతోంది. అంతే కాకూండా అలియా తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేందుకు.. ప్రతి వారం ఖచ్చితంగా.. థెరపీ తీసుకుంటానని కూడా చెప్పుకొచ్చింది. ఇటు అమ్మగా ఇంట్లో బాధ్యతలను, అటు ఉద్యోగ జీవితాన్ని బాలన్స్ చేయడం అనేది సాధారణ విషయం కాదని.. ఒక రకంగా ఈ మానసిక ఒత్తిడి కారణంగా స్త్రీలు తమ కెరీర్ ను కూడా త్యాగం చేసుకుంటున్నారని.. ఆమె పేర్కొంది. కాబట్టి కాబోయే తల్లులంతా కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని ఆమె చెబుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి