iDreamPost

బాబుగారి దుబాయ్‌ దోస్త్‌ కథ ముగిసింది!

బాబుగారి దుబాయ్‌ దోస్త్‌ కథ ముగిసింది!

‘కేవలం నన్ను చూసే బిలీనియర్‌ అయిన బీఆర్‌ శెట్టి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇది కేవలం నా వల్లే సాధ్యమైంది’’ అంటూ అప్పట్లో చంద్రబాబు ఓ రేంజ్‌లో చెప్పుకున్నారు.

వందల కోట్లు విలువ చేసే భూమిని కేవలం లక్షలకే బీఆర్‌ శెట్టికి కట్టబెట్టేశారు. అమరావతిలో వంద ఎకరాల్లో బీఆర్‌ఎస్‌ మెడిసిటీ, కృష్ణా నది మధ్యలో ఉన్న ద్వీపాల్లో గోల్ఫ్‌ కోర్సులు ఆయన కట్టేస్తున్నారంటూ మీడియా గొట్టాల ముందు టముకు వేసుకున్నారు. ఆ ఊపులోనే 2017 ఆగస్టు నెలలో శంకుస్థాపన కూడా చేసేశారు. ఆ తర్వాత విషయం అందరూ ఊహించిందే. పచ్చటి పిచ్చి మొక్కల మధ్యలో శిలాఫలకాలు అందంగా వెలిగిపోతున్నాయి.

అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటారా?.. చంద్రబాబు చెప్పిన బీఆర్‌ శెట్టి అలియాజ్‌ భగవత్తు రఘురామ్‌ శెట్టి అసలు రంగు ఇటీవలే బయట పడింది. ఎన్‌ఎమ్‌సీ హెల్త్‌ కేర్‌ పేరుతో దుబాయ్‌తో సహా 12 దేశాల్లో ఆస్పత్రులను, మెడికల్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన శెట్టి.. బిలీనియర్‌ ముసుగులో తప్పుడు లెక్కలు చూపిస్తూ నెట్టుకొస్తున్నారని మడ్డీ వాటర్స్‌ అనే అంతర్జాతీయ సంస్థ బయటపెట్టింది. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్నప్పటికీ అందరినీ మాయ చేసేందుకు జిమ్మిక్కులు చేస్తూ వచ్చారని తేల్చింది. అప్పులు తీవ్రం కావడంతో తన వాటాగా ఉన్న షేర్లను బ్యాంకులను తనఖా పెట్టేశారని తెలిపింది.

ఈ విషయం బయటికి రావడంతో ఎన్‌ఎమ్‌సీ షేర్లు 70 శాతం పడిపోయాయి. భాగస్వాముల నుంచి ఒత్తిడి పెరగడంతో 17వ తేదీన తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు పూర్తిగా కంపెనీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంతైనా చంద్రబాబు మెచ్చిన బిలీనియర్‌ కదా.. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి