iDreamPost
android-app
ios-app

సీక్రెట్ గా ప్రియుడితో లైగర్ భామ చక్కర్లు! వైరల్ అవుతున్న ఫోటోలు!

  • Author ajaykrishna Published - 03:18 PM, Thu - 20 July 23
  • Author ajaykrishna Published - 03:18 PM, Thu - 20 July 23
సీక్రెట్ గా ప్రియుడితో లైగర్ భామ చక్కర్లు! వైరల్ అవుతున్న ఫోటోలు!

సినీ ఇండస్ట్రీలో ప్రేమకథలు ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే.. ప్రేమలో పడ్డ సెలబ్రిటీలు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరు గెస్ చేయలేరు. కానీ.. డేటింగ్ లేదా లవ్ లో ఉన్నప్పుడు వారు చేసే ఎంజాయ్ మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ లవ్ స్టోరీస్ అన్ని మధ్యలో బ్రేక్ అయ్యేవే. ఇప్పటిదాకా లవ్ చేసుకున్న వారంతా ఫస్ట్ లవ్ ని కాకుండా సెకండ్, థర్డ్ లవ్స్ ని పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ ఫస్ట్ లవ్ నే పెళ్లి చేసుకున్నా.. ఆ బంధం ఎప్పుడు తెగుతుందో అనే భయం వారి ఫ్యామిలీస్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం లైగర్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనన్య పాండే.. లవ్ లో ఉంది.

కొంతకాలంగా తన ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. ఫస్ట్ మూవీ ప్లాప్ అయినప్పటికీ.. ఓవైపు కెరీర్ పరంగా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యే దారి వెతుక్కుంటోంది అమ్మడు. అందుకే.. తన సహనటుడు, హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. లైగర్ ప్లాప్ తర్వాత అనన్యకి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. పైగా ఆమె యాక్టింగ్ స్కిల్స్ కి ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. అయితే.. ఈ మధ్య అనన్య.. రెగ్యులర్ గా తన ప్రియుడు ఆదిత్యతో కలిసి వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ ప్రెజెంట్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ ప్రేమజంట గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. అనన్య, ఆదిత్య ఇద్దరూ ఎక్కడ పడితే అక్కడ కెమెరా కంట చిక్కుతున్నారు. ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్.. పోర్చుగల్ వేకెషన్ లో ఉన్నారట. అక్కడ వీరిద్దరూ ఫన్ వీల్ స్కూటర్ రైడ్ చేస్తూ.. రెస్టారెంట్ లో ఎదురెదురుగా కూర్చొని కళ్ళలో కళ్లు పెట్టి చూసుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తూ.. నెటిజన్స్ ఈ లవ్ బర్డ్స్ కి కంగ్రాట్స్ చెబుతూనే, వీళ్ల లవ్ ఎంతకాలం ఉంటుందో చూద్దాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఆదిత్య రీసెంట్ గా ‘ది నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక అనన్య డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహా, కంట్రోల్ అనే మూవీస్ చేస్తోంది. మరి ఈ లైగర్ బ్యూటీ లవ్ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet Giriş