iDreamPost

లేడీ సూపర్ స్టార్ కు బాలీవుడ్ అవకాశం

లేడీ సూపర్ స్టార్ కు బాలీవుడ్ అవకాశం

దశాబ్దానికి పైగా మార్కెట్ తగ్గించుకోకుండా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఒక్క నయనతార వల్లే సాధ్యమయ్యిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ తమిళంలో తనకు వస్తున్న ఆఫర్లకు హద్దు పద్దు ఉండదు. మనవాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు కానీ రెమ్యునరేషన్ భారీగా ఉంటే తప్ప ఇక్కడా ఒప్పుకున్న దాఖలాలు లేవు. ఇటీవలే చిరంజీవి లూసిఫర్ రీమేక్ ఆఫర్ ఇచ్చారనే టాక్ వచ్చింది కానీ ప్రకటించే దాకా అదెంత వరకు నిజమనేది చెప్పలేం. ఇవి కాకుండా కోలీవుడ్ లోనే చాలా బిజీగా ఉన్న నయన్ కు బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కబోతున్నట్టు లేటెస్ట్ చెన్నై అప్ డేట్. అయితే ఇక్కడో బ్యాక్ స్టోరీ కూడా ఉంది లెండి.

షారుఖ్ ఖాన్ తో చేయబోతున్న దర్శకుడు ఆట్లీ. విజయ్ తో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఇతనితో సినిమా చేయాలని షారుఖ్ ముందే ఫిక్స్ చేసుకున్నాడు. కానీ దీనికన్నా ముందు ఇచ్చిన కమిట్ మెంట్స్ వల్ల పెండింగ్ లో ఉంచుతూ వచ్చారు. దానికి తోడు కింగ్ ఇమేజ్ కి తగ్గట్టు కమర్షియల్ అంశాలు ఏదీ మిస్ కాకుండా స్క్రిప్ట్ ని లాక్ చేయడానికి ఆట్లీ సమయం కోరడంతో ఇది ఇంత ఆలస్యమవుతూ వచ్చింది. త్వరలోనే ఫైనల్ వెర్షన్ ని లాక్ చేయబోతున్నట్టు తెలిసింది. షారుఖ్ ప్రస్తుతం పఠాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంకో ఆరు నెలల దాకా టైం పట్టేలా ఉంది.

నయన్ గతంలో అట్లీతో రాజా రాణి, విజిల్ లో చేసింది. అప్పటి నుంచే ఈ కాంబో సక్సెస్ ఫుల్ గా ప్రూవ్ అయ్యింది. అందుకే తనకు అచ్చివచ్చిన హీరోయిన్ ని బాలీవుడ్ కు పరిచయం చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అట్లీ. ఇది అఫీషియల్ కాలేదు కానీ మొత్తానికి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే వార్తే. నయనతార కొత్త త్రిల్లర్ నేత్రికన్ ఓటిటి రిలీజ్ ప్లాన్స్ లో ఉంది. ఇంకా ఫైనల్ కాలేదు కానీ త్వరలోనే డీల్ సెట్ అవ్వొచ్చట. గత ఏడాది అమ్మోరు తల్లితో డిజిటల్ ప్రేక్షకులను పలకరించిన నయన్ ఇప్పుడు మరోసారి కనిపించే ఛాన్స్ ఉంది. చిరంజీవి, రజని, వెంకీ, నాగ్, బాలయ్య లాంటి అగ్ర హీరోల సరసన నటించిన తనకు షారుఖ్ తో కాంబో స్పెషల్ గా నిలిచేదే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి