iDreamPost

ఇప్పుడే కాదు, ఇకమీదట కూడా ఇడ్లీ వడే గతి!

Bollywood: బాలీవుడ్ కి దేశమంతా బ్రహ్మరథం పట్టిన రోజుల నుంచి బాలీవుడ్ అంటే ఏవగింపు పెంచుకున్న స్థాయికి ఆ ఇండస్ట్రీ దిగజారిపోయింది. తాజాగా రామ చరణ్ విషయంలో షారుఖాన్ ప్రవర్తించిన తీరుతో మరింత దిగజారింది.

Bollywood: బాలీవుడ్ కి దేశమంతా బ్రహ్మరథం పట్టిన రోజుల నుంచి బాలీవుడ్ అంటే ఏవగింపు పెంచుకున్న స్థాయికి ఆ ఇండస్ట్రీ దిగజారిపోయింది. తాజాగా రామ చరణ్ విషయంలో షారుఖాన్ ప్రవర్తించిన తీరుతో మరింత దిగజారింది.

ఇప్పుడే కాదు, ఇకమీదట కూడా ఇడ్లీ వడే గతి!

ఇదీ లేటెస్ట్ వార్ ఆన్ ట్విట్టర్. ఎన్నాళ్ళగానో కడుపులో దాచుకున్న ఉక్రోషం టన్నుల కొద్దీ బయట పడింది. బాలీవుడ్ కి దేశమంతా బ్రహ్మరథం పట్టిన రోజుల నుంచి బాలీవుడ్ అంటే ఏవగింపు పెంచుకున్న స్థాయికి బాలీవుడ్ దిగజారిపోయింది. ఓ పక్కన చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో పాటు సుశాంత్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్ పట్ల నార్త్ లో కూడా తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. హిట్స్ ఎలా తీయాలి, మంచి కథలను ఎలా ఎంచుకోవాలి అనే ప్రయత్నానికి సున్నా చుట్టి, తమకి పోటీ వస్తారనుకున్న వాళ్ళని కూడా తుదముట్టించడానికి వెనుకాడరనే అప్రతిష్టను బాలీవుడ్ ఇటీవలి రోజుల్లో మూటగట్టుకుని పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది.

దక్షిణాది విషయంలో మాత్రం బాలీవుడ్ బాబుల పప్పులుడకడం లేదు. బాహుబలి చిత్రంతో దక్షిణాది, అందునా ముఖ్యంగా తెలుగువారి ధాటికి తట్టుకోలేని పరిస్థితుల్లో కక్కలేక మింగలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు పాపం ఖాన్ బాబాయ్ బ్యాచ్. ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచం మొత్తం భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుందో, దెబ్బ మీద దెబ్బ పడిపోయింది. పుండు మీద కారం జల్లినట్టుగా, త్రిబుల్ ఆర్ లో నాటునాటు పాటకి ఏకంగా ఆస్కార్ వేదికపైనే ఘన సన్మానం లభించిందో అదీ మరీ పెద్ద గొడ్డలిపెట్టు అయి కూర్చుంది. జేమ్స్ కేమరూన్, స్పిల్ బర్గ్ లాటి దిగ్దర్శకులు కూడా రాజమౌళిని మెచ్చుకోవడంతో జీర్ణించుకోలేకపోయారు.

ఇదిగాక త్రిబుల్ ఆర్ తో ప్రపంచమంతా పేరు తెచ్చుకుని, హాలీవుడ్ ఆపర్లు కూడా అలవోకగా వచ్చిన రామ్ చరణ్ అంటే బాలీవుడ్ హీరోలు కొందరికి పీడకలలా మారింది. ఇందులో చమత్కారం మరొకటుంది. హాలీవుడ్ ఆఫర్లు వచ్చినా కూడా రామ్ చరణ్ చంకలు గుద్దుకోకపోగా, చాలా జెంటిల్ వేలో ప్రస్తుతానికి ఇండియన్ ఫిల్మ్స్ చేస్తున్నాను, అవి పూర్తయితే గానీ చేయలేను అని చెప్పడం మరింత మరింత వాళ్ళని నీరుగార్చింది. ఒక తెలుగు హీరోకి హాలీవుడ్ ఆఫర్లు రావడమే కాకుండా, ఇండియన్ ఫిల్మ్స్ అని రామ్ చరణ్ ఉచ్ఛరించడంతో రామ్ చరణ్ ముందు వాళ్ళు మరుగుజ్జుల్లా అయిపోయిన ఫీలింగ్ లో కూరుకుపోయారు.

పైగా అంబానీ ఇంట్లో వేడుకకి పూర్వం రోజుల్లో అయితే ఏమో ఆహ్వానాలు వచ్చి ఉండేవో లేదో….దాదాపుగా రావనే చెప్పాలి. కానీ ఈ రోజున రామ్ చరణ్ హాజరుకానీ, కాలేని కార్యక్రమమే లేదు భారతదేశంలో. మొన్నీ మథ్య అయోధ్యలో జరిగిన రామవిగ్రహ ప్రాణ ప్రతిష్టకు కూడా మెగాస్టార్ చిరంజీవి దంపతులకు, రామ్ చరణ్ కు ఆహ్వానాలు అందడం, వాళ్ళు ఆ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా పాలు పంచుకోవడం…ఇన్ని సమున్నతమైన గౌరవాలు ఒక్కపెట్టున వచ్చేస్తుంటే, బాలీవుడ్ బాతులకు దిమ్మతిరిగిపోతోంది. ఇదంతా కడుపులో ఉక్కిరిబిక్కిరిగా ఊపిరాడని పరిస్థితులలో రామ్ చరణ్ కనిపించగానే షారుఖ్ కి ఒక్కసారిగా క్రేక్ వచ్చేసింది.

ఈ రామ్ చరణే కదా దీనంతటి కారణం అనే ఉక్రోషం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది పాపం షారుఖ్ గుండెల్లో. మరి కెజీఎప్, ఫుష్ఫ ఇవన్నీ నిద్రపోనిస్తున్నాయా? తెలుగువారి ముందు ఇప్పటికే కుప్పకూలి, కుదేలైపోయిన బాలీవుడ్, ఇకమీదట కూడా కనుచూపు మేరలో తెలుగు తేజాలను ఎదుర్కొనే దమ్మూ, సత్తా ఉన్నవాళ్ళు కరువై, ఇడ్లీ, వడే గతిగా మిగులుతారు. బాలీవుడ్ నుంచి ఎన్ని కంపెనీలు తెలుగు సినిమాలు చేయడానికి, పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్న సినిమాలను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నాయి? ఇదంతా మరి వాళ్ళు గ్రహించలేక కాదు. గ్రహించే ఈ ఆక్రోశం, ఉక్రోషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి