iDreamPost

OTT Movie: ఒకరి భార్య.. ఇంకొకరికి! OTTలోకి వచ్చేసిన బోల్డ్ & కామెడీ మూవీ! ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Apr 26, 2024 | 1:22 PMUpdated Apr 26, 2024 | 2:11 PM

కామెడీ చిత్రాలంటే అందరికి ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎంచక్కా ఫ్యామిలితో కలిసి చూసేయొచ్చు కాబట్టి ఈ క్రమంలో తాజాగా మరొక బాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటి ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

కామెడీ చిత్రాలంటే అందరికి ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎంచక్కా ఫ్యామిలితో కలిసి చూసేయొచ్చు కాబట్టి ఈ క్రమంలో తాజాగా మరొక బాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటి ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Apr 26, 2024 | 1:22 PMUpdated Apr 26, 2024 | 2:11 PM
OTT Movie: ఒకరి భార్య.. ఇంకొకరికి! OTTలోకి వచ్చేసిన బోల్డ్ & కామెడీ  మూవీ! ఇదే ఫస్ట్ టైమ్!

ఓటీటీ లో అన్ని భాషల చిత్రాలు అన్ని జోనర్స్ చిత్రాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో హర్రర్ , సస్పెన్స్, యాక్షన్ చిత్రాలలో మునిగి తేలిపోతున్న మూవీ లవర్స్ కు.. సరదాగా కాసేపు నవ్వించడానికి త్వరలో ఓ కామెడీ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు అందరు అది ఏ జోనర్ సినిమా అని చూస్తున్నారే తప్ప ఏ భాష సినిమా అని చూడడం లేదు. దీనితో ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా.. వరుసగా హిట్ అయిపోతూనే ఉన్నాయి. అందులోనే ఇప్పుడు రాబోయేది కామెడీ సినిమా.. అంటే ఎంచక్కా ఫ్యామిలి తో కలిసి కూర్చుని ఎంజాయ్ చేసేయొచ్చు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి రానుంది అనే విషయాల గురించి ఓ లుక్ వేసేద్దాం.

ఈ బాలీవుడ్ కామెడీ డ్రామా పేరు .. “లాపతా లేడీస్”. ఈ సినిమా పేరే ఇంత కామెడీగా ఉంటే ఇక సినిమా కథ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఊహించవచ్చు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ కూడా ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 1 వ తేదీన థియేటర్స్ లో విడుదలయింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద.. మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ లవర్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా.. “తాజా కబురు, తప్పిపోయిన మహిళలు దొరికారు. ఈ అర్ధరాత్రి నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలవుతుంది” అంటూ కేవలం ఒక్క రోజు ముందే ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాలో.. నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు దక్కించుకున్న చిత్రంగా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం .. దాదాపు రూ.20 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. కొత్తగా పెళ్లయిన ఇద్దరు నవ వధువులు అనుకోకుండా ఒకరి ప్లేస్ లోకి మరొకరు మారిపోతారు. ఆ తర్వాత అసలైన భార్యను ఓ వ్యక్తి వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుందనే కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి