iDreamPost

OTTలోకి రూ.200 కోట్ల హారర్ మూవీ! కదలకుండా చూడటానికి సిద్ధంగా ఉన్నారా?

  • Published Apr 15, 2024 | 1:44 PMUpdated Apr 15, 2024 | 1:44 PM

బాలీవుల్ హీరో అజయ్ దేవ్‌గ‌ణ్‌, తమిళ్ స్టార్ హీరో మాధ‌వ‌న్, హీరోయిన్ జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ “సైతాన్”. అయితే తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకి ఎప్పుడంటే..

బాలీవుల్ హీరో అజయ్ దేవ్‌గ‌ణ్‌, తమిళ్ స్టార్ హీరో మాధ‌వ‌న్, హీరోయిన్ జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ “సైతాన్”. అయితే తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Apr 15, 2024 | 1:44 PMUpdated Apr 15, 2024 | 1:44 PM
OTTలోకి రూ.200 కోట్ల హారర్ మూవీ! కదలకుండా చూడటానికి సిద్ధంగా ఉన్నారా?

బాలీవుల్ హీరో అజయ్ దేవ్‌గ‌ణ్‌, తమిళ్ స్టార్ హీరో మాధ‌వ‌న్, హీరోయిన్ జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ “సైతాన్”. సూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను దర్శకుడు వికాస్ భల్ తెరకెక్కించారు. కాగా, మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది.ఇక ఈ సినిమాకు మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సైతాన్ సినిమా ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సైతాన్ మూవీ గతకొన్ని రోజులుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. కానీ, ఇంతవరకు స్ట్రీమింగ్ డేట్ అనేది ఎక్కడ వినిపించడం లేదరు. అయితే త్వరలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రానుందని తాజా సమాచారం వినిపిస్తోంది.ఇంతకి ఎప్పుడంటే..

సూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సైతాన్’ మూవీలో అజయ్ దేవగన్ హీరోగా, మాధవన్ విలన్ గా ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే మొదటి రోజు నుంచే ఈ సినిమా భారీ హిట్ టాక్ ను అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సైతాన్ మూవీకి రూ . 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు సైతాన్ మూవీ ఓటీటీలోకి వస్తుందనని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైతాన్ మూవీని వచ్చేనెల మే 3వ తేదీ నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍ కు రానుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై  ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అనుకున్న తేదీ ప్రకారమే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తే థియేటర్లలో రిలీజైన 8 వారాలకే ఓటీటీలో సందడి చేయడం  అనేది విశేషం.

Shaithaan

కాగా, వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు.

ఇక సైతాన్ మూవీ కథ విషయానికొస్తే.. క‌బీర్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌), అతని భార్య జ్యోతి(జ్యోతిక‌) త‌మ కూతురు జాన్వీతో క‌లిసి ఓ విలేజ్‌కు హాలీడే ట్రిప్ కు వెళ్తారు. వెళ్లే దారిలో వారికి ఓ స్నేహితుడిగా.. క‌బీర్‌కు ప‌రిచ‌యం అవుతాడు వ‌న్‌రాజ్ (మాధ‌వ‌న్‌). ఈ క్రమంలో కూతురు జాన్వీ (జానకి)కి ఓ విషపూరితమైన పదార్థం ఇస్తాడు వన్ రాజ్. ఇక అతని రాకతో క‌బీర్ ఫ్యామిలీ క‌ష్టాల్లో ప‌డుతుంది. తన మాయ, మంత్రాలతో క‌బీర్ ఫ్యామిలీని వ‌న్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? అసలు ఆ సైకో వన్ రాజ్ ఎవరు ! ఈ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు! అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. మరి, “సైతాన్” సినిమా మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్త పై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి