iDreamPost

కోట్ల రూపాయల లగ్జరీ కారును పాడు చేసిన ఎలుకలు.. లక్షలు నష్టపోయిన స్టార్ హీరో

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సత్తా చాటుతున్నారు యంగ్ హీరోలు. వారిలో ఒకరు ఈ కుర్ర హీరో కూడా. డాక్టర్ల ఫ్యామిలీ నుండి వచ్చిన అతడు.. యాక్టర్ అయ్యి.. ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. అతడికి ఓ కాస్ట్లీ కారు గిఫ్లుగా రాగా, దాన్ని ఎలుకలు పాడు చేశాయని అంటున్నాడు.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సత్తా చాటుతున్నారు యంగ్ హీరోలు. వారిలో ఒకరు ఈ కుర్ర హీరో కూడా. డాక్టర్ల ఫ్యామిలీ నుండి వచ్చిన అతడు.. యాక్టర్ అయ్యి.. ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. అతడికి ఓ కాస్ట్లీ కారు గిఫ్లుగా రాగా, దాన్ని ఎలుకలు పాడు చేశాయని అంటున్నాడు.

కోట్ల రూపాయల లగ్జరీ కారును పాడు చేసిన ఎలుకలు.. లక్షలు నష్టపోయిన స్టార్ హీరో

ఏదైనా నచ్చిన వస్తువును కొనుక్కొని తెచ్చుకుంటే.. కొత్తలో అపురూపంగా చూసుకుంటారు. ఆ తర్వాత కాస్త మోజు తగ్గినప్పటికీ.. మనకు ఇష్టమైనదైతే కేర్ ఫుల్‌గా వాడుతుంటాం. అది ఇంట్లో ఉంటే వస్తువైనా.. బయట పార్క్ చేసే వాహనమైనా. కానీ ఊహించని విధంగా ఎవరైనా పాడు చేస్తే తట్టుకోలేరు. ఇప్పుడు ఇదే పెయిన్ అనుభవిస్తున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కార్తీక్. డాక్టర్ల ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ ఇంజనీరింగ్ కుర్రాడు.. ప్యార్ కా పంచనామాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అలా వైకుంఠపురం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి.. తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు.

షెహజాదా పేరుతో నిర్మించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ 2022లో వచ్చిన మూవీ భూల్ భూలయ్యా-2 భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ కొట్టినందుకు ఆ చిత్ర నిర్మాత సంస్థ టీ సిరీస్ అధినేత.. ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్ లారెన్ కారును కార్తీక్ ఆర్యన్‌కు బహుమతిగా అందించాడు. ఈ ఖరీదైన కారును ఇప్పుడు ఎలుకలు పాడు చేశాయట. దీంతో లబోదిబో మంటున్నాడు ఈ కుర్ర హీరో. కారులో ఉంటే మ్యాట్స్ ను ఎలుకలు కొరికేయడంతో బాధలో మునిగి తేలుతున్నాడు. కేవలం మ్యాట్స్ వేసేందుకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తన కారును గ్యారేజీలో పార్క్ చేశానని చెబుతున్నాడు. కోట్లు ఖరీదైన కారును ఎలుకలు పాడు చేశాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కార్తీక్ ఆర్యన్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం చందు ఛాంపియన్‌ అనే బయోపిక్‌లో నటిస్తున్నాడు. భారత తొలి పారాలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు  కబీర్ ఖాన్ దర్శకుడు.  ఈ మూవీతో పాటు సూపర్ హిట్ చిత్రం భూల్ భూలయ్యా-2కి సీక్వెల్ తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కార్తీక్ ఆర్యన్. సినిమా బడ్జెట్, నిర్మాత పరిస్థితిని బట్టి హీరోలు పారితోషికం తగ్గించుకుంటారని.. కొన్నిసార్లు రెమ్యునరేషన్ పూర్తిగా వదిలేస్తారని అన్నారు. తాను కూడా షెహజాదా సినిమాకు పారితోషకం తీసుకోలేదని కార్తీక్ తెలిపాడు. కాగా, ఈ సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి