iDreamPost

Bob Biswas : బాబ్ బిస్వాస్ రిపోర్ట్

Bob Biswas : బాబ్ బిస్వాస్ రిపోర్ట్

నిన్న ఓటిటి ఫాలోయర్స్ కి ఎంటర్ టైన్మెంట్ గట్టిగానే దక్కింది. అన్ని భాషల్లోనూ కలిపి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగానే పలకరించాయి. అందులో బాబ్ బిస్వాస్ ఒకటి. అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మీద అంచనాలు ఎక్కువగా ఉండటానికి ప్రత్యేక కారణం ఉంది. విద్యా బాలన్ కెరీర్ బెస్ట్ అని చెప్పుకునే కహాని సినిమాలో కిల్లర్ పాత్రను పూర్తి స్థాయిలో విస్తరించి ఒక రకంగా చెప్పాలంటే అతని బయోపిక్ గా దీన్ని రూపొందించారు. ఈ జానర్ చిత్రాలు డిజిటల్ లో బాగా సక్సెస్ అవుతాయి కాబట్టి జీ5 సంస్థ దీని మీద గట్టి నమ్మకమే పెట్టుకుంది. మరి ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

తను గతంలో చేసిన హత్యలను మర్చిపోయిన బాబ్ బిస్వాస్(అభిషేక్ బచ్చన్)కొన్ని నెలలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాక భార్యా పిల్లలను ఇంకా గుర్తుపట్టలేని స్థితిలో ఉండగానే ఇంటికి తిరిగి వస్తాడు. పోలీసులు మాత్రం తన మీద నిఘా ఉంచుతారు. కాలేజీ పిల్లలను టార్గెట్ చేసుకుని ఓ ముఠా బ్లూ అనే డ్రగ్ ని టాబ్లెట్ల రూపంలో అమ్ముతుంటుంది. ఈ ఉచ్చులో బాబ్ కూతురు కూడా చిక్కుకుంటుంది. అయితే అనుకోకుండా ఆ గ్యాంగ్ లో సభ్యులను ఒక్కొక్కరిగా బాబ్ తో హత్యలు చేయిస్తుంది డిపార్ట్ మెంట్. ఈ రకంగా మళ్ళీ మర్డర్లు చేయడం మొదలుపెట్టిన బాబ్ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుకుందనేది సినిమాలో చూడాలి

ప్రముఖ దర్శకుడు సుజయ్ ఘోష్ కూతురు దియా అన్నపూర్ణ ఘోష్ డెబ్యూ డైరెక్టోరియల్ మూవీ ఇది. ప్లాట్ బాగానే ఉన్నప్పటికి నీరసమైన కథనంతో బాబ్ బిస్వాస్ సహనానికి పరీక్ష పెడుతుంది. 45 నిమిషాల దాకా అసలు కథలోకి ప్రవేశించకుండా అవసరం లేని తంతుతో టైం వేస్ట్ చేశారు. కహానిలో చూసిన బాబ్ పాత్రకు ఇక్కడి క్యారెక్టర్ కు ఏ మాత్రం సంబంధం లేదన్నట్టుగా మరీ నీరసంగా స్క్రీన్ ప్లే సాగింది. అభిషేక్ బచ్చన్ కూడా నిరాశపరుస్తాడు. నటన కూడా అంతంత మాత్రమే. సాంకేతిక విభాగాలు కూడా హెల్ప్ లెస్ గా మిగిలాయి. ఏం చేయాలో అర్థం కానంత ఖాళీ టైం ఉంటే తప్ప బాబ్ బిస్వాస్ పొరపాటున కూడా ట్రై చేయకండి

Also Read : Unstoppable With NBK : అబ్బాయి తర్వాత బాబాయ్ తో సూపర్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి