iDreamPost

Abhishek Bachchan : వారసత్వం వస్తే సరిపోదు నిలబెట్టుకోవాలి

Abhishek Bachchan : వారసత్వం వస్తే సరిపోదు నిలబెట్టుకోవాలి

ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ స్టార్ హీరో ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు అమితాబ్ బచ్చన్. దశాబ్దాల తరబడి వెండితెర ప్లస్ టివిలో చక్రం తిప్పుతున్న బిగ్ బి వయసును సైతం లెక్కచేయకుండా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన అభిషేక్ బచ్చన్ మాత్రం తనదంటూ బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేయలేకపోయారు. ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు కానీ అవేవి బిగ్ బి బ్యాక్ గ్రౌండ్ అండ్ రేంజ్ తగ్గవి కాదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సృష్టించుకున్న మార్కెట్ ని అభిషేక్ లాంటి వాళ్ళు అందుకుంటాడని ఆశించిన అభిమానులకు తమ కల నెరవేరకపోవడం నిరాశ కలిగించేదే.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. టాలీవుడ్ లో స్టార్ వారసులు తమ వారసత్వాన్ని ఎంత బలంగా కాపాడుకుంటారో చూస్తున్నాం. ఎన్టీఆర్ వదిలి వెళ్లిన లెగసీని బాలయ్య నిలబెట్టారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా కృషి చేస్తున్నాడు. చిరంజీవి సృష్టించిన సామ్రాజ్యంలో మొదటి వారసుడిగా రామ్ చరణ్ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు చిరుతతో మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ దాకా చేసింది కేవలం 13 సినిమాలే. అయినా అశేషమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఏఎన్ఆర్ అబ్బాయిగా వచ్చిన నాగార్జున శివ నుంచి బంగార్రాజు దాకా ఇప్పటికీ నవ మన్మథుడే.

ఇలా చూసుకుంటూ వెళ్తే అభిషేక్ బచ్చన్ ఎక్కడ పొరపాట్లు చేశాడో అర్థమవుతుంది. కథల ఎంపికలో తడబాటు, ఎలాంటి పాత్రలు చేయాలో తెలియని కన్ఫ్యూజన్ కెరీర్ పరంగా నెంబర్ అయితే పెంచింది కానీ నాన్న ఇచ్చిన అభిమాన నిధిని పెంచేందుకు కాదు. పెర్ఫార్మన్స్ పరంగా అభిషేక్ బచ్చన్ బ్యాడ్ యాక్టర్ కాదు. ఇటీవల వచ్చిన కొన్ని ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఆ విషయాన్ని రుజువు చేశాయి. కానీ కమర్షియల్ మార్కెట్ లో నిలదొక్కుకున్నప్పుడే మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు అభిషేక్ బచ్చన్ ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. అంతే అందరి జాతకాలు ఒకేలా ఉండవుగా

Also Read : Jersey : ఇద్దరి మధ్య షాహిద్ నిలవగలడా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి