iDreamPost

చంద్రబాబు అరెస్టుపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!

చంద్రబాబు అరెస్టుపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈ విషయంపై ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కోలా స్పందిస్తుంది. అలానే నేతలు కూడా వ్యక్తిగతంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను కొందరు సమర్ధిస్తుంటే, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకున్ని ఇలా అరెస్ట్ చేశారంటే.. బలమైన ఆధారాలు ఉంటేనే చేస్తారని రఘనందన్ రావు అభిప్రాయ పడ్డారు.

శనివారం ఉదయం 5.45 గంటల సమయంలో నంద్యాలలో చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకెళ్లి.. సుదీర్ఘ సమయం పాటు విచారించారు. అయితే  ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టగా, పోలీసులు నిలువరించారు.

అలానే వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం చంద్రబాబు అరెస్ట పై స్పందించారు. ఆయన అరెస్ట్  ను కొందరు వ్యతిరేకించగా, మరికొందరు సమర్ధించారు.  స్కామ్ లకు పాల్పడిన వారి కోసం జనాలు బయటకు రావాల అంటూ కొందరు నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి ఘటన జరగడం వెనుక బలమైన వ్యూహం ఉందని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకున్ని ఇలా అరెస్ట్ చేశారంటే.. బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే ఇలా చేస్తారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

తనకు ఆ కేసు గురించి పూర్తి అవగాహన లేదని.. కానీ.. ఇలాంటి సమయంలో అరెస్ట్ చేసి ప్రతిపక్ష పార్టీకి సానుభూతి క్రియేట్ చేయాలని ఏ అధికార పార్టీ అనుకోదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ.. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, ప్రధాన మంత్రి కుటుంబసభ్యులు అరెస్టైన దాఖలాలున్నాయని గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అరెస్టుకు ఖండించారు. మరి.. బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి