iDreamPost

అనుకున్నదే జగన్‌ చేశారా..? మంత్రివర్గంలోనూ అదే పంథా కొనసాగించారా..?

అనుకున్నదే జగన్‌ చేశారా..? మంత్రివర్గంలోనూ అదే పంథా కొనసాగించారా..?

బడుగు,బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం కల్పించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. తాజాగా మంత్రివర్గ విస్తరణలోనూ అదే పంథా కొనసాగించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశారు. మొత్తం మంత్రివర్గంలో 70 శాతం పదవులు ఈ వర్గాల వారికే కట్టబెట్టారు. బడుగు, బలహీన వర్గాల వారికి ఈ స్థాయిలో మంత్రిపదవులు ఇచ్చిన నేతగా చరిత్ర సృష్టించారు.

25 మంత్రి పదవుల్లో అగ్రాసనం బీసీలకు దక్కింది. బీసీలకు 10 మంత్రి పదవులను సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చారు. ఓసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీ, మైనారిటీలకు ఒకటి చొప్పన పదవులు కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.

మంత్రుల ప్రాంతీయ, సామాజిక, విద్యా నేపథ్యం ఇదీ..

మంత్రిపేరు, నియోజకవర్గం, పాత జిల్లా, కొత్త జిల్లా, కులం, జాబితా, విద్యార్హతలు..

1. ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా, పొలినాటి వెలమ, బీసీ, ఇంటర్మీడియట్‌.

2. సీదిరి అప్పలరాజు, పలాస, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా, మత్స్యకార, బీసీ, ఎండీ జనరల్‌. ఎంఈడీ.

3. బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి, విజయనగరం జిల్లా, తూర్పుకాపు, బీసీ, బీఏ.

4. పీడిక రాజన్నదొర, సాలూరు, విజయనగరం, పార్వతీపురం జిల్లా, ఎస్టీ, ఎంఏ.

5. గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి, విశాఖ, అనకాపల్లి జిల్లా, తెలగకాపు, ఓసీ, బీటెక్‌.

6. బూడి ముత్యాలనాయుడు, మాడుగుల, విశాఖ, అనకాపల్లి జిల్లా, కొప్పులవెలమ, ఎస్సీ, ఇంటర్మీడియట్‌.

7. దాడిశెట్టి రాజా, తుని, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, తెలగకాపు, ఓసీ, బీఏ.

8. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రామచంద్రాపురం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా, శెట్టిబలిజ, బీసీ, బీఏ.

9. పినిపే విశ్వరూప్, అమలాపురం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా, మాల, ఎస్సీ, బీఎస్సీ, బీఈడీ.

10. తానేటి వనిత, కొవ్వూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, మాదిగ, ఎస్సీ,

11. కారుమూరి నాగేశ్వరరావు, తణుకు, పశ్చిమ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, యాదవగొల్ల, బీసీ, ప్రాథమిక విద్య.

12. కొట్టు సత్యనారాయణ, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, పశ్చిమ గోదావరిజిల్లా, తెలగకాపు, ఓసీ, ఇంటర్మీడియట్‌.

13. జోగి రమేష్, పెడన, కృష్ణా, కృష్ణా జిల్లా, గౌడ, బీసీ, బీఎస్సీ.

14. మేరుగ నాగార్జున, వేమూరు, గుంటూరు, బాపట్ల జిల్లా, మాల, ఎస్సీ, పీహెచ్‌డీ.

15. విడదల రజని, చిలకలూరిపేట, గుంటూరు, పల్నాడు జిల్లా, ముదిరాజ్, బీసీ, బీఎస్సీ, (ఎంబీఏ).

16. అంబటి రాంబాబు, సత్తెనపల్లి, గుంటూరు, పల్నాడు జిల్లా, తెలగకాపు, ఓసీ, బీఎల్‌.

17. ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం, ప్రకాశం, ప్రకాశం జిల్లా, మాదిగ, ఎస్సీ, పీహెచ్‌డీ.

18. కాకాని గోవర్థన్‌ రెడ్డి, సర్వేపల్లి, నెల్లూరు, నెల్లూరు జిల్లా, రెడ్డి, ఓసీ, పీహెచ్‌డీ.

19. ఆర్కే రోజా, నగరి, చిత్తూరు, చిత్తూరు జిల్లా, రెడ్డి, ఓసీ, బీఏ.

20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు, చిత్తూరు, చిత్తూరు జిల్లా, రెడ్డి, ఓసీ, పీహెచ్‌డీ.

21. కళత్తూరు నారాయణ స్వామి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, చిత్తూరు జిల్లా, మాల, ఎస్సీ, బీఎస్సీ.

22. అంజాద్‌ బాషా, కడప, వైఎస్సార్‌ కడప, వైఎస్సార్‌ కడప జిల్లా, ముస్లిం, బీసీ, బీఏ.

23. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, డోన్, కర్నూలు, నంద్యాల జిల్లా, రెడ్డి, ఓసీ, బీటెక్‌.

24. గుమ్మనూరు జయరాం, ఆలూరు, కర్నూలు, కర్నూలు జిల్లా, బోయ, బీసీ, పదో తరగతి,

25. కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం, అనంతపురం, అనంతపురం జిల్లా, కురుబ, బీసీ. ఎంఎస్సీ, (పీహెచ్‌డీ)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి