iDreamPost

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు గురించి ప్రత్యేక  చెప్పనక్కర్లేదు. 2002 గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు గురించి ప్రత్యేక  చెప్పనక్కర్లేదు. 2002 గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

బిల్కిస్ బానో కేసు గురించి ప్రత్యేక  చెప్పనక్కర్లేదు. 2002 గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలం పాటి సాగిన ఈ కేసులో అనేక మలుపు తిరిగాయి. కొంతకాలం క్రితమే ఈ కేసుకు సంబంధించి 11 మందికి క్షమాభిక్ష పెడుతూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

2002 లో గోద్రా రైలు దహనకాండ జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం కూడా గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి కిరాతకంగా కొందరు దుండగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి చాలా ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ సాగింది.

Sensational verdict of the Supreme Court!

2008లో జనవరి 21న 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.  అప్పటి నుంచి జీవిత ఖైదీలుగా ఆ 11 మంది శిక్ష అనుభవిస్తున్నారు. అయితే 2023 ఆగష్టు 15న గుజరాత్ ప్రభుత్వం ఆ 11 మంది దోషులకు రెమిషన్ మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో  గుజరాత్ రాష్ట్రం నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఇక బాధితురాలి పిటిషన్ ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించింది. చివరకు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలు సవాల్ చేయడం సరైన నిర్ణయమేనని పేర్కొంది. అంతేకాక 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్‌ మంజూరు చేస్తూ గుజరాత్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.

దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది.  అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనాన్ని మంజూరు చేయడానికి అర్హత ఉంటుందంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మరి.. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి