iDreamPost
android-app
ios-app

Big Boss OTT S3: బిగ్ బాస్ OTT సీజన్ 3 ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే!

  • Published Jun 11, 2024 | 10:46 AM Updated Updated Jun 11, 2024 | 10:46 AM

బుల్లి తెర ప్రేక్షకులందరిని అలరించే రియాలిటీ షో బిగ్ బాస్. అయితే కేవలం టెలివిజన్స్ కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే బిగ్ బాస్ ఓటీటీ కూడా ఉంది. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

బుల్లి తెర ప్రేక్షకులందరిని అలరించే రియాలిటీ షో బిగ్ బాస్. అయితే కేవలం టెలివిజన్స్ కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే బిగ్ బాస్ ఓటీటీ కూడా ఉంది. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Jun 11, 2024 | 10:46 AMUpdated Jun 11, 2024 | 10:46 AM
Big Boss OTT S3: బిగ్ బాస్ OTT సీజన్ 3 ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే!

ఓటీటీ అంటే ఇప్పటివరకు సినిమాలు , సిరీస్ లు మాత్రమే అందరికి పరిచయం. మరి బిగ్ బాస్ ఓటీటీ ఏంటి అనుకుంటున్నారా.. అవును బిగ్ బాస్ ఓటీటీ కూడా ఉంది.ఈ షో చాలా ఏళ్ళ కిందటే ఇండియాలో స్టార్ట్ అయింది. బిగ్ బాస్ రియాలిటీ షో టెలివిజన్స్ లో అయితే హిందీ బిగ్ బాస్ షో మొత్తంగా 17 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక తెలుగులో 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ ఓటీటీ బిగ్ బాస్ మాత్రం రెండేళ్ల క్రిందటే మొదలైంది.బిగ్ బాస్ ఓటీటీ అంటూ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఇప్పటికే ఈ ఓటీటీ బిగ్ బాస్ రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడవ సీజన్ ను జూన్ 21 నుంచి స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ను కరణ్ జోహార్ హోస్ట్ చేశాడు. ఇక రెండవ సీజన్ ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేశాడు. ఇక ఇప్పుడు మూడవ సీజన్ ను అనిల్ కపూర్ హోస్ట్ చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ను జూన్ 10 న రిలీజ్ చేశారు. ఇక ఈ సీజన్ ను మొత్తంగా మార్పు చూసినట్లయితే.. సల్మాన్ ఖాన్ బదులు అనిల్ కపూర్ రావడమే. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అన్ని మారిపోతాయి అంటూ అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అనిల్ కపూర్ ను కేవలం సినిమాలలో మాత్రమే చూసిన ప్రేక్షకులు.. ఇక ఇప్పుడు హోస్ట్ గా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ బాస్ ఓటీటీ .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో ప్రసారం అవుతుంది.

ఇక ఈ ప్రోమోలో అనిల్ కపూర్ ఎంట్రీ విషయానికొస్తే.. “ఇదే మిగిలి ఉందా ఏకే అంటూ అందరూ అడిగారు. నేనడిగాను ఏం ఏం మిగిలి ఉన్నాయి ఏకే అని. మంచి చెడు.. నీళ్లు నిప్పు.. తిట్లు చప్పట్లు.. అన్నీ చూశాను అన్నీ విన్నాను.. ఇప్పుడు నా వంతు.. రూల్ కొత్తది.. గేమ్ అదే.. కొంచెం లాజిక్.. కొంచెం మ్యాజిక్” అంటూ ఎంట్రీ ఇచ్చాడు. సో దీనిని బట్టే ఈ సీజన్ ఇంకాస్త కొత్తగా ఉంటుందని అందరికి అర్థమైపోయి ఉంటుంది. మరి ఈ షో ఎలా ఉండబోతుందో.. అనిల్ కపూర్ ఎలా హోస్ట్ చేయబోతున్నారో చూడాలని అందరు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş