iDreamPost

వాలెంటైన్స్ డే కు ముందు షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ! విడిపోతున్నామంటూ..

Bigg Boss Fame Confirm They Breakup: వాలంటైన్స్‌ డేకు ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకుంటారు.. ఎంజాయ్ చేస్తుంటారు. కానీ బిగ్ బాస్ బ్యూటీ మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పింది.

Bigg Boss Fame Confirm They Breakup: వాలంటైన్స్‌ డేకు ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకుంటారు.. ఎంజాయ్ చేస్తుంటారు. కానీ బిగ్ బాస్ బ్యూటీ మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పింది.

వాలెంటైన్స్ డే కు ముందు షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ! విడిపోతున్నామంటూ..

బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. కానీ బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ,కన్నడ, మలయాళం భాషల్లో కూడా బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టంట్స్ మధ్య గొడవలు, స్నేహాలు, ప్రేమ వ్యవహారాలు ఎన్నో జరుగుతుంటాయి.  హౌజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంతమంది తమ ప్రేమను కంటిన్యూ చేస్తుంటారు. అలా  ఓ బ్యూటీ తన ప్రేమను కంటిన్యూ చేస్తూ వచ్చింది. కానీ.. వాలెంటైన్స్ డే కి ముందే  ఈ బ్యూటీ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ బిగ్ బాస్ జంట ఎవరు.. ఏం నిర్ణయం తీసుకున్నారు అన్నవిషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 14  ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దమవుతున్నారు. కొంతమంది ప్రేమికులు వాటంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమను లవర్ కి ప్రపోజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. రేపటి వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ప్రేమ మైకంలో మునిగి తేలుతుంటే.. బుల్లితెర జంట మాత్రం విడిపోతున్నాం అంటూ ప్రకటించి షాకిచ్చారు. బాలీవుడ్ బిగ్ బాస్ 14 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ఇజాజ్ ఖాన్-పవిత్ర పూనియా కి మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ జంటపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చేవి. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ జంట ప్రేమలోకంలో మునిగిపోయారు.

అన్నీ కుదిరితే అదే ఏడాదిలో ఈ జంట పెళ్లై వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాల్సింది. కానీ.. పెళ్లి విషయాన్ని పక్కనబెట్టి రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల ఈ జంట మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయని బీటౌన్ లో తెగ వార్తలు వస్తున్నాయి. అది నిజం చేస్తూ.. ఈ జంట తాము బ్రేకప్ చెప్పుకోబోతున్నాం అంటూ అంగీకరించారు. మొన్నటి వరకు ఒకే అపార్ట్‌మెంట్ లో ఉన్న ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం పవిత్ర మాత్రం అదే ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా బ్రేకప్ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ‘ప్రతిదానికీ ఒక ఎక్స పైరీ డేట్ అనేది ఉంటుంది.. ఏది శాశ్వతం కాదు. ప్రేమానుబంధాలకు కూడా ఇదే వర్తిస్తుంది. రిలేషన్స్ ఏవీ కలకాలం కలిసి ఉండవని నా అభిప్రాయం.. కొన్ని నెలల క్రితమే నేను, ఇజాజ్ విడిపోయాం. నేను ఇజాజ్ ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాను. మా మధ్య ప్రేమ ఇక ముగిసిపోయంది.’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి