iDreamPost

Keerthi Bhat: వీడియో: అమర్ దీప్ ఫ్యాన్స్ ఏడిపిస్తున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్!

  • Author Soma Sekhar Published - 10:00 PM, Fri - 8 December 23

అమర్ దీప్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్. తన బాధను తెలియజేస్తూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అమర్ దీప్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్. తన బాధను తెలియజేస్తూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Author Soma Sekhar Published - 10:00 PM, Fri - 8 December 23
Keerthi Bhat: వీడియో: అమర్ దీప్ ఫ్యాన్స్ ఏడిపిస్తున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్!

బిగ్ బాస్.. బుల్లితెర రియాలిటీ షోల్లో ఓ సంచలనం. అప్పటి వరకు ఉన్న షోలన్నీ ఒకెత్తు అయితే.. ఈ బిగ్ బాస్ మరోఎత్తు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కొట్లాటలు, గొడవలు, టాస్క్ లు కామన్. అప్పుడే గొడవ పడి.. మళ్లీ కొద్ది సమయానికే కలిసిపోతారు. హౌస్ లో ఉన్నా వారు బాగానే కొట్టుకంటూ.. తిట్టుకుంటూ కలిసిపోతున్నారు. కానీ వాళ్ల ఫ్యాన్స్ బయట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవలే వనితా విజయ్ కుమార్ విషయంలో జరిగిన దాడి మరిచిపోక ముందే.. బిగ్ బాస్ షో కారణంగా ఓ నటికి ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి వేధింపులు ఎదురౌతున్నాయట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వీడియో ద్వారా వెల్లడించింది. అమర్ దీప్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్.

కీర్తి భట్.. సీరియల్ నటిగా తనకంటూ బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది కాసేపు పక్కన పెడితే.. కీర్తి భట్ ను అమర్ దీప్ ఫ్యాన్స్ వేధిస్తున్నారట. దానికి కారణంగా ఆమె అమర్ దీప్ కు సపోర్ట్ చేయకుండా ఇటీవల ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణకు మద్దతు ఇవ్వడమే. సీరియల్ బ్యాచ్ కు కాకుండా గౌతమ్ కు సపోర్ట్ ఇవ్వడమేంటంటూ.. అమర్ దీప్ ఫ్యాన్స్ ఆమెను బూతులు తిడుతూ వేధిస్తున్నారట. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో కీర్తి భట్ ఈ విధంగా మాట్లాడింది.

“బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్ కు వెళ్లిన దగ్గర్నించి నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయి. ఇక నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ అమర్ దీప్ ఫ్యాన్స్ నన్ను నోటికి వచ్చినట్లు తిడుతూ వేధిస్తున్నారు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నా తప్పుంటే మీ కాళ్లు మెుక్కుతా. తప్పు లేదంటే మాత్రం మీ ఇంటికొచ్చి.. మీ అమ్మముందే నడి రోడ్డుపై కొడతా. నా జీవితంతో ఆడుకోకండి ప్లీజ్. అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోండి. సోషల్ మీడియాలో మీరు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇక ఎవరికి నచ్చిన వాళ్లని వాళ్లు సపోర్ట్ చేస్తుంటారు అందులో తప్పేముంది. నా తిండి నేను తింటున్నాను, నలుగురికి పెడుతున్నారు, నన్ను వదిలేయండి ప్లీజ్” అంటూ ఎమోషనల్ అయ్యింది. సోలోగా ఆడేవారికే నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆటను ఆటగా చూడండి.. అంతేగానీ పర్సనల్ గా చూసి.. ఇలా టార్గెట్ చేయడం మంచిది కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి