iDreamPost

మెహబూబ్ ఇంటికి – కన్నీటి వర్షంలో సభ్యులు

మెహబూబ్ ఇంటికి – కన్నీటి వర్షంలో సభ్యులు

రెండు రోజుల నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ వారం బిగ్ బాస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ తో మొన్న అంత డ్రామా ఆడించి ఉసూరుమనిపించిన నాగార్జున నిన్న మాత్రం సభ్యులను కన్నీటి వర్షంలో మునిగే ఛాన్స్ ఇచ్చారు. ఒక్కసారిగా ఈ విషయం తెలియగానే అందరూ ఓ రేంజ్ లో ఎమోషనల్ అయ్యారు. ఇది ఆశించిందే కానీ మెహబూబ్ కాబట్టి డోస్ డబుల్ అయ్యింది. అతని బెస్ట్ ఫ్రెండ్ సోహైల్ గురించి చెప్పనక్కర్లేదు. డ్యామ్ కట్టలు తెంచుకున్నట్టుగా ధారాళంగా ఏడ్చేశాడు. మెహబూబ్ కు సైతం ఏదో క్యాన్సర్ పేషంట్ లెవెల్ లో కల్ హో న హో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టి డాన్స్ చేయించారు.

దీనికన్నా ముందు ఎప్పటిలాగే టాస్కులు డిస్కషన్లతో సండే ఎపిసోడ్ సాగింది. ఎలిమినేషన్ల నుంచి ముందు తప్పించుకున్న వాళ్లలో అరియనా, మోనాల్ లు సేవ్ అయ్యారు. లాస్య కొట్టిన కొబ్బరికాయ వల్ల హారికకు గండం తప్పింది. మిగిలినవాళ్లలో సోహైల్ మెహబూబ్ లను పెద్ద బల్బుల వద్ద నిలబెట్టి ఫైనల్ గా రిజల్ట్ ని డిక్లేర్ చేశారు. మెహబూబ్ వెళ్తూ అవినాష్ ఒకవారం కోడిగుడ్డుతో సహా నాన్ వెజ్ తినకూడదనే స్వీట్ పనిష్మెంట్ ఇచ్చి సెలవు తీసుకున్నాడు. లేడీ పార్టిసిపెంట్స్ కూడా మెహబూబ్ వెళ్లడం పట్ల సహజంగానే తమదైన రీతిలో కళ్ళు తుడుచుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

ఇప్పటిదాకా డెబ్భై ఒక్క ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ గేమ్ ఇంకో నెలలో ముగింపుకు వచ్చే అవకాశం ఉంది. చేతిలో నాలుగు వారాలు ఉన్నాయి కాబట్టి ఇకపై డ్రామాను ఎలా రసవత్తరంగా మార్చబోతున్నారో వేచి చూడాలి. కుమార్ సాయి రీ ఎంట్రీ గురించి గట్టి ప్రచారమే జరుగుతోంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. తనను ఎలిమినేట్ చేసినప్ప్పుడు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కున్న బిగ్ బాస్ నిర్వాహకులు డ్యామేజ్ కంట్రోల్ కు రెడీ అయ్యారు. అందులో భాగంగానే కుమార్ సాయి రాబోతున్నట్టుగా తెలిసింది. వచ్చే నెల రోజుల్లో ఇంకా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండే ఛాన్స్ లేకపోలేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి