iDreamPost

Glenn Maxwell: ప్రపంచ క్రికెట్ కు కొత్త షాట్ పరిచయం చేసిన మ్యాక్స్ వెల్! వీడియో వైరల్..

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కొట్టే షాట్స్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మరో కొత్త షాట్ ను ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేశాడు మ్యాక్సీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కొట్టే షాట్స్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మరో కొత్త షాట్ ను ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేశాడు మ్యాక్సీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Glenn Maxwell: ప్రపంచ క్రికెట్ కు కొత్త షాట్ పరిచయం చేసిన మ్యాక్స్ వెల్! వీడియో వైరల్..

ప్రపంచ క్రికెట్ లోకి ఎప్పుడైతే టీ20లు ప్రవేశించాయో.. అప్పటి నుంచి ఈ జెంటిల్ మెన్ గేమ్ రూపురేఖలే మారిపోయాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు అవ్వడమే కాకుండా.. సరికొత్త బ్యాటింగ్ షాట్స్ ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. ఈ కొత్త షాట్స్ కు ఆద్యుడు ఎవరు? అంటే.. చాలా మందికి ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కొట్టే షాట్స్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మరో కొత్త షాట్ ను ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేశాడు మ్యాక్సీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మ్యాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరుకు స్పెషల్ క్రేజ్ ఉంది. తనదైన మెరుపు ఇన్నింగ్స్ లతో బౌలర్ల పాలిట చండశాసనుడిగా మారిన విషయం మనందరికి తెలిసిందే. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో కూడా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు మ్యాక్స్ వెల్. ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో ఓడిపోయే స్టేజ్ లో ఉన్న ఆసీస్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక తన బ్యాటింగ్ లో మెరుపు షాట్లతో పాటుగా, కొన్ని కొత్త కొత్త షాట్లను కూడా ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేస్తుంటాడు. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో కూడా ఓ నయా షాట్ ను అభిమానులకు ఇంట్రడ్యూస్ చేశాడు.

మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రినేగాడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సరికొత్త షాట్ ను క్రికెట్ ను పరిచయం చేశాడు మ్యాక్స్ వెల్. మెల్బోర్న్ స్టార్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న మ్యాక్స్ వెల్ ప్రత్యర్థి బౌలర్ రిచర్డ్ సన్ వేసిన ఓవర్ లో అద్భుతమైన షాట్ తో అలరించాడు. ఈ బాల్ ను స్లిప్ లో చీకీ షాట్ తో బౌండరీ తరలించిన తీరు చూసితీరాల్సిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 14 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనేగార్డ్ టీమ్ 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం 98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 2 వికెట్లు కోల్పోయి 12.1 ఓవర్లలోనే ఛేదించింది. జట్టులో థామస్ రోజర్ 46 పరుగులతో అజేయంగా నిలవగా.. మ్యాక్స్ వెల్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లతో 32 రన్స్ తో అజేయంగా నిలిచాడు. మరి వరల్డ్ క్రికెట్ కు సరికొత్త షాట్స్ పరిచయం చేస్తున్న మ్యాక్స్ వెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి