iDreamPost

ఏపీ వాసులకు మరో వందేభారత్ రైలు

Vande Bharat Express: ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సెమీ-హై స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఏపీలో ఇప్పటికే వందేభారత్ పరుగులు పెడుతునున్న క్రమంలో మరో గుడ్ న్యూస్.

Vande Bharat Express: ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సెమీ-హై స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఏపీలో ఇప్పటికే వందేభారత్ పరుగులు పెడుతునున్న క్రమంలో మరో గుడ్ న్యూస్.

ఏపీ వాసులకు మరో వందేభారత్ రైలు

టెక్నాలజీ పరంగా భారతీయ రైల్వే ఎంతో అభివృద్ది సాధించింది. హై స్పీడ్, హైటెక్ సౌకర్యాలతో రైళ్ల పనితీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రయాణికులకు అత్యంత మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు తీసుకు వచ్చిందే వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇందులో ప్రయాణం విమానం లాంటి అనుభూతినిస్తుంది. గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణంచే ఈ రైలు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వందేభారత్ లో ప్రయాణం సెఫ్టీ మాత్రమే కాదు.. చాలా తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఏపీ వాసులకు శుభవార్త చెప్పిందిన రైల్వే శాఖ. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ కు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. విశాఖ-భువనేశ్వర్ మధ్య నడిచే వందేభారత్ రైలు ను ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు పట్టాలపై పరుగులు పెడుతుంది. ఈ వందేభారత్ రైలు టికెట్లు మార్చి 17 నుంచి ఐఆర్‌సీటీసీ పోర్టల్ లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. రాబోయే సమ్మర్ సీజన్ లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు తక్కువ సమయంలో వెళ్లాలనుకునే వారు వందేభారత్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరీ విశాఖ-భువనేశ్వర్ టికెట్ వివరాల గురించి తెలుసుకుందామా..

ప్రతిరోజూ ఉదయం 5.15 గంటలకు వందేభారత్ భువనేశ్వర్ ట్రైన్ 20811 నెంబర్ తో బయల్దేరుతుంది. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ స్టాపు‌ల విషయానికి వస్తే.. ఖుర్దోరోడ్డ, బలుగావ్, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణం 20842 రైలు నెంబర్ తో ఈ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 443 కిటోమీటర్ల దూరాన్ని 5.45 గంటల్లో కవర్ చేస్తుంది వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ లో రెండు ఏసీ చైర్ కారు, ఆరు ఎగ్జీక్యూటీవ్ చైర్ కారు బోగీలు ఉన్నాయి.

Another vande bharat train to AP

టికెట్ల విషయానికి వస్తే.. భువనేశ్వర్ టు విశాఖ ఏసీ చైర్ కారు టికెట్ విలువ రూ.1,115 ఉండగా, బేస్ ఫేర్ రూ.841, రిజర్వేషన్ చార్జి రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జీ రూ.40, జీఎస్టీ, కేటరింగ్ చార్జి అన్నీకలిపి ర.142 గా ఉంది. ఎగ్జీక్యూటీవ్ చైర్ కారు టికెట్ విలువ రూ.2,130, కేటరింగ్ చార్జీ రూ.175 గా ఉంది. అయితే రిటన్ జర్నీ లో ఏసీ చైర్ కారు ధర మాత్రం 1280 ఉండగా, ఎగ్జీక్యూటీవ్ చైరు కారు ధర రూ.2,325 గా స్వల్పంగా పెంచారు. మరి తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే ప్రయాణికుల ఇది సువర్ణ అవకాశం అంటున్నారు. ఏపీలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి